వామ్మో దాని కోసం 10 కేజీలు తగ్గిందా ?

తెలుగులో మంచి ఫాంలో ఉన్న నటీమణి రకుల్. ఆమె బాలీవుడ్ లో తన అదృష్టం పరీక్షించుకో బోతోంది. ‘దే దే ప్యార్ దే’ సినిమా మీద ఆమె గట్టిగానే ఆశలు పెట్టుకుంది. 50 ఏళ్ళ వయసున్న హీరో పాత్రతో ప్రేమలో పడే పడుచు అమ్మాయిగా ఇందులో చాలా డిఫరెంట్ రోల్ చేస్తోంది. ప్రమోషన్ లో సైతం అలుపు లేకుండా పాల్గొంటోంది. దీనికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది రకుల్. మొదట ఈ పాత్ర ఆఫర్ చేసినప్పుడు దర్శకుడు ఆకివ్ అలీ నిర్మాత లవ్ రంజన్ బరువు తగ్గమని చెప్పారట. అచ్చంగా కాక్ టైల్ లో దీపికా పదుకునే తరహాలో బాగా సన్నబడాలని సూచించారు. దాంతో స్వంతంగా జిమ్ ఉన్న తను నో చెప్పడం భావ్యం కదని భావించి వెంటనే ఓకే చెప్పిందట. నెల రోజుల పాటు కఠిన శిక్షణ తీసుకుని 10 కేజీల బ‌రువు త‌గ్గి కోరుకున్న షేప్ ని సాధించిందట. ఆహార అలవాట్లు మార్చుకోవడం కష్టం అనిపించినా దానికీ రెడీ అయ్యింది. మొత్తానికి దాని తాలుకు ఫలితాన్ని సాంపిల్ రూపంలో ట్రైలర్ లో రకుల్ మందు కొట్టి డాన్స్ చేసిన వీడియో సాంగ్ లోనూ చూడొచ్చు. ఈ చిత్రం వ‌చ్చే నెల 17న విడుద‌ల కానుంది.