అందరూ ఇది తెలుసుకుంటే బెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

అందరూ ఇది తెలుసుకుంటే బెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

కరోనా సంక్షోభంలో కూడా కొందరు చేస్తున్న దారుణాలు చూస్తుంటే తన రక్తం మరిగిపోతోంది అంటోంది రకుల్. తాజాగా ఆమే ఓ చానల్‌తో మాట్లాడుతూ… ఇటీవల మనేసర్‌లో ఓ అత్యాచార ఘటన గురించి పత్రికలో చదివా. నా రక్తం మరిగింది.

ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఇటువంటివి జరుగుతుంటే… మనల్ని మనుషులుగా పిలవాలా? నాకు సందేహం కలుగుతోంది’ అని సీరియస్‌ అయింది రకుల్‌. కరోనా వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజల వద్దకు నేరుగా వెళ్లి సహాయం చేయాలనుందనీ, కానీ నిబంధనల కారణంగా వెళ్లలేకపోతున్నానని తెలిపారు.

‘జీవితం చాలా చిన్నది. ఏ రోజు ఎవరం ఎలా ఉంటామో తెలీదు. దానికి ఇప్పుడున్న పరిస్థితులే ఉదాహరణ. కాబట్టి ఉన్నన్నాళ్లూ మంచిగా, ప్రేమగా ఉండాలి. అందరూ ఇది తెలుసుకుంటే బెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’అని రకుల్‌ చెప్పుకొచ్చింది. రకుల్ ప్రస్తుతం బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. అమన్ కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు.