Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మెగా ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకులు అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘రంగస్థలం’. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దం అయ్యింది. రేపు వైజాగ్ బీచ్‌లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ వేడుక జరుగబోతుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయి. ఇక ఈ చిత్రం అంచనాలను పెంచేలా రామ్ చరణ్ తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్బంగా చేశాడు. ఆ వ్యాఖ్యలు మెగా ఫ్యాన్స్‌లో ఉత్సాహంను నింపుతుండగా, సినీ విశ్లేషకులు మాత్రం కాస్త అతిగా ఉన్నాయనే విమర్శలు చేస్తున్నారు.
అసలు చరణ్ ఏమన్నాడంటే… రంగస్థలం చిత్రం కోసం 365 రోజులు, రోజుకు 24 గంటలు కష్టపడి సినిమా చేశామని, ఖచ్చితంగా ఇది మీ నమ్మకంను నిలుపుతుందని చెప్పుకొచ్చాడు. నా 10 ఏళ్ల కెరీర్లో ది బెస్ట్ మూవీ అవ్వడంతో పాటు, ఈ చిత్రంలో తాను ది బెస్ట్ ఫెర్ఫార్మెన్స్‌ను ఇచ్చినట్లుగా చెప్పుకొచ్చాడు. తాను ఎప్పుడూ కూడా తన సినిమాను చూడమని కోరను, కాని ఈసారి మాత్రం తప్పకుండా అందరు ఈ చిత్రాన్ని చూడాలని కోరుకుంటున్నాను అంటూ చరణ్ చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో మరియు మీడియా వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. కెరీర్లోనే టాప్ సినిమా అంటూ చరణ్ చేసిన వ్యాఖ్య కాస్త అతిగా ఉందనే విమర్శ వ్యక్తం అవుతుంది. కాని మెగా ఫ్యాన్స్ మాత్రం కలెక్షన్స్ పరంగా, నటన పరంగా అన్ని విధాలుగా ఈ చిత్రం దుమ్ము దులిపేయడం ఖాయం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.