Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం పూజా కార్యక్రమాలు ఇటీవలే సింపుల్‌గా జరిగాయి. ఇక రెగ్యులర్ షూటింగ్‌ను చిరంజీవి పుట్టిన రోజు వేడుకల తర్వాత అంటే ఈనెల 22 తర్వాత ప్రారంభించబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు ప్రకటించారు. గత ఆరు నెలలుగా మెగా ఫ్యాన్స్‌తో పాటు సినీ వర్గాల్లో ఈ చిత్రం గురించి కుప్పలు తెప్పలుగా చర్చలు జరుగుతున్నాయి. రెగ్యులర్ షూటింగ్‌కు ముందే చిత్ర టైటిల్‌ను ప్రకటించి, టైటిల్ లోగోను ఆవిష్కరించాలని చిత్ర యూనిట్ సభ్యులు నిర్ణయించారు. అందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ‘మహావీర’ అనే టైటిల్‌ను కొణిదెల ప్రొడక్షన్స్‌లో రిజిస్ట్రర్ చేయించడం జరిగిందట. ఆ టైటిల్‌ను తెలుగుతో పాటు తమిళం మరియు హిందీలో కూడా ఖరారు చేయనున్నారు.
గత కొన్ని రోజులుగా మెగా ఫ్యామిలీకి రాజమౌళికి మద్య దూరం పెరుగుతుంది. మీడియాలో వస్తున్న వార్తలకు ఫుల్స్టాప్ పెట్టేందుకు రాజమౌళిని దగ్గరకు తీసుకునేందుకు రామ్ చరణ్ మాస్టర్ ప్లాన్ వేశాడు. ఈనెల 22న రాజమౌళి చేతుల మీదుగా చిరు151వ చిత్రం టైటిల్ లోగోను ఆవిష్కరించబోతున్నాడు. ‘బాహుబలి 2’ విడుదల తర్వాత పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటున్న రాజమౌళి ఇలాంటి కార్యక్రమాల్లో ఎక్కువగా కనిపిస్తున్నాడు. అందుకే చరణ్ స్వయంగా రాజమౌళితో మాట్లాడి తన తండ్రి 151వ చిత్రం లోగో ఆవిష్కరణకు ఆహ్వానించినట్లుగా తెలుస్తోంది. చరణ్ ఫోన్‌కు రాజమౌళి ఓకే చెప్పడం జరిగింది. రాజమౌళి హ్యాండ్‌తో చిరు 151వ చిత్రం క్రేజ్ మరింత పెరగడం ఖాయం.
మరిన్ని వార్తలు: