Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి ఎంత ఘనంగా జరుపుకుంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండు రాష్ట్రాలు కూడా స్కూల్స్ మరియు కాలేజ్‌లకు వారం రోజులు అధికారిక సెలవు దినాలుగా ప్రకటిస్తాయి. ఎక్కువ సెలవులు ఉన్న కారణంగా తెలుగు సినిమాలు సంక్రాంతికి విడుదల ఎక్కువ ఉంటాయి. చాలా సంవత్సరాలుగా సంక్రాంతికి పెద్ద సినిమాలు విడుదల అవ్వడం ఆనవాయితిగా వస్తూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా పెద్ద సినిమాలు విడుదల కావడం, ఒకటి రెండు అయినా సక్సెస్ అవ్వడం జరుగుతుంది. గత సంవత్సరం చిరంజీవి ఖైదీ నెం.150 మరియు బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రాలు విడుదల అయ్యాయి. వాటితో పాటు శర్వానంద్ శతమానం భవతి చిత్రం కూడా విడుదలై సక్సెస్‌ను సాధించింది. గత సంవత్సరం సంక్రాంతికి ఏకంగా 200 కోట్ల వసూళ్లను మూడు చిత్రాు కలిసి సాధించాయి.
ఇక ఈ సంవత్సరం విషయానికి వస్తే 250 కోట్ల టార్గెట్‌తో సంక్రాంతికి నాలుగు సినిమాలు ప్లాన్ చేసుకున్నాయి. అందులో ప్రధానమైనది ‘అజ్ఞాతవాసి’. తర్వాత జైసింహా, గ్యాంగ్, రంగుల రాట్నం. నాలుగు సినిమాల్లో ఇప్పటికే మూడు సినిమాల ఫలితం తేలిపోయింది. రంగులరాట్నం కూడా భారీ అంచనాలను ఏమీ కలిగి లేదు. మొత్తానికి సంక్రాంతికి 250 కోట్లు అనుకుంటే కనీసం 100 కోట్లు అయినా వసూళ్లు సాధించే అవకాశాలు కనిపించడం లేదు. సంక్రాంతికి ‘రంగస్థలం’ విడుదల చేయాలని చరణ్ ఎంతగానో ఆశపడ్డాడు. కాని బాబాయి పవన్ అజ్ఞాతవాసితో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో మార్చికి రంగస్థలంను వాయిదా వేయడం జరిగింది.
సుకుమార్ దర్శకత్వం వహించడంతో పాటు, సమంత హీరోయిన్గా నటించడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలను అందుకు సునాయాసంగా సంక్రాంతి సీజన్‌కు 100 కోట్లను చరణ్ వసూళ్లు చేసేవాడు అంటూ ట్రేడ్ నిపుణులు అంటున్నారు. సంక్రాంతి సీజన్‌ను చరణ్ మిస్ అవ్వడంతో మెగా ఫ్యాన్స్ కూడా నిరుత్సాహంను వ్యక్తం చేస్తున్నారు.