Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రంగస్థలం’. ఈ చిత్రం మరి కొన్ని రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేయబోతున్నారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ వారు నిర్మిస్తున్నారు. సమంత ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న కారణంగా అంచనాలు మరీ ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన చిట్టిబాబు మరియు రామలక్ష్మి టీజర్‌లు సినిమా స్థాయిని అమాంతం పెంచేశాయి. 1980ల నేపథ్యంలో ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ చాలా విభిన్నంగా చిత్రీకరిస్తున్నట్లుగా టీజర్‌లు చూస్తేనే అర్థం అయ్యింది. ఇక ఇటీవలే ఒక పాట కూడా సినిమాపై ఆసక్తిని పెంచింది. మార్చి చివర్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.
ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను చాలా గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. మొదటి వేడుకను వైజాగ్‌లో ఉగాది రోజున వైభవంగా నిర్వహించాలని నిర్ణయించారు. మార్చి 18న వైజాగ్‌లో మెగా ఫ్యాన్స్ సమక్షంలో జరుగబోతున్న ఈ వేడుకలో మెగా హీరోలు పలువురు పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో కూడా మరో ప్రమోషనల్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నారు. అందుకు సంబంధించిన డేట్ ఫిక్స్ అవ్వాల్సి ఉంది. వైజాగ్‌లో జరిగే వేడుకను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాతలు తీజుకున్నారు. అతి త్వరలోనే సినిమాను షూటింగ్‌ను పూర్తి చేసి ఆ పనుల్లో బిజీ కానున్నారు. ఈ మెగా వేడుక కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.