సుజీత్ టాలెంటెడ్ అయినా సరే.. రెండో సినిమాకే ఇంత పెద్ద బాధ్యత మోయాల్సి రావడం ప్రతికూలంగా మారింది. అతనెంత కష్టపడ్డా కూడా ఫలితం లేకపోయింది. ఇక్కడే దర్శకులకు అనుభవం ఎంత ముఖ్యమన్నది అర్థమైంది. ఐతే ఇప్పుడు రామ్ చరణ్.. ప్రభాస్‌ను మించిన రిస్క్ చేయబోతున్నట్లుగా వార్తలొస్తున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చరణ్.. ప్రదీప్ అనే కొత్త దర్శకుడితో సినిమా చేయబోతున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతుండటం గమనార్హం.
ఇన్నేళ్ల కెరీర్లో చరణ్ ఇప్పటిదాకా ఎన్నడూ కొత్త దర్శకులతో పని చేయలేదు. మొదట్నుంచి పేరున్న దర్శకులతో చేస్తూ వచ్చాడు. మధ్యలో ఒక సినిమా అనుభవం ఉన్న సంపత్ నందితో ‘రచ్చ’ చేశాడు. అది మినహా రిస్కుల జోలికి వెళ్లలేదు.
ఐతే ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ చేస్తున్న చరణ్.. దీని తర్వాత కొత్త దర్శకుడితో జట్టు కడతాడని, యువి క్రియేషన్స్ బేనర్లో ఈ సినిమా తెరకెక్కుతుందని అంటున్నారు. ఐతే చరణ్‌ను ఇప్పుడున్న ఇమేజ్‌తో ఓ కొత్త దర్శకుడు హ్యాండిల్ చేయడమే అంత సులువు కాదు. అలాంటిది ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత అతడి ఇమేజ్ ఏ స్థాయికి వెళ్తుందో అంచనా వేయడం కష్టం.
‘