ప్రస్తుతం మెగా ఫ్యామిలీ ఇంట మాత్రం ఈ జూన్ మొత్తం సందడే నెలకొన్నది అని చెప్పాలి. ముఖ్యంగా ఈ 2024 జూన్ మాత్రం మరింత ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు . అయితే గత జూన్ నుంచి ఈ జూన్ వరకు కూడా మెగా మనవరాలు క్లిన్ కారా జన్మించడంతో మెగా ఫ్యామిలీ కి పట్టిందల్లా బంగారం అయ్యిందని చెప్పుకోవాలి .
రామ్ చరణ్ కు గ్లోబల్ రెస్పాన్స్ అలాగే అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డు, మెగాస్టార్ చిరంజీవి కు పద్మవిభూషణ్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో విజయం ఇలా మెగా కుటుంబంలో వరుస విజయాలు నమోదు అయ్యాయి. అయితే ఈరోజు జూన్ 20తో క్లిన్ కారా మెగా కుటుంబంలోకి అడుగు పెట్టి సరిగా ఏడాది అయ్యింది.
దీనితో ఉపాసన ఒక బ్యూటిఫుల్ అండ్ ఎమోషనల్ వీడియోను పోస్ట్ చేసింది. మరి ఇందులో మనకి తెలియని విజువల్స్ చాలా నే ఉన్నాయి. మెయిన్ గా రామ్ చరణ్ పై చాలా మూమెంట్స్ బాగున్నాయి. మొదటిసారి తండ్రి కాబోతున్నారు అనే ఒక ఎగ్జైట్మెంట్ తన కళ్ళలో సుస్పష్టంగా కనిపిస్తుంది.
అలాగే పాప పుట్టిన తర్వాత చరణ్, ఉపాసన తల్లిదండ్రుల నడుమ వికసించిన ఆనందాన్ని మనం చూడొచ్చు. ఇక ఇందులో అయితే మెగాస్టార్ క్లిన్ కార కొణిదెల అని పేరుని అనౌన్స్ చేయడం వంటివి మంచి హైలైట్ గా మారాయి. అలాగే ఒక విజువల్ లో అయితే తమ పాపను చూసి ఉపాసన భావోద్వేగానికి లోనయ్యింది. ఇలా ఒక బ్యూటిఫుల్ వీడియోను షేర్ చేసి . ఈ బర్త్ డే కి పర్ఫెక్ట్ ట్రీట్ ని అందించింది. దీనితో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా భావోద్వేగానికి లోనవుతున్నారు.
వీడియో ని మీరు కూడా చుడండి ..
https://www.instagram.com/p/C8aRY5BSlnw/