అనుకున్నది అయ్యింది.. వర్మ సైడ్‌

director ram gopal varma and nagarjuna officer movie postponed

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ, అక్కినేని నాగార్జునల కాంబినేషన్‌లో చాలా కాలం తర్వాత రూపొందిన చిత్రం ‘ఆఫీసర్‌’. వీరిద్దరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన సినిమాలు సూపర్‌ హిట్‌గా నిలిచాయి. అందుకే ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. కాని సినిమా విడుదలకు ముందు మెగా ఫ్యాన్స్‌తో వర్మ పెట్టుకున్న గిల్లి కజ్జాల కారణంగా విడుదలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. సినిమాను విడుదల చేయనివ్వం అంటూ మెగా ఫ్యాన్స్‌ హెచ్చరించడం, వాటికి సమాధానంగా దర్శకుడు వర్మ స్పందిస్తూ తన సినిమాను ఏం చేయలేరు, తాను అనుకున్నట్లుగా మే 25కు విడుదల చేసి తీరుతాను అంటూ ప్రకటించడం జరిగింది. అంత గట్టిగా చెప్పిన వర్మ ఇప్పుడు తన సినిమాను కాస్త ఆలస్యంగా విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

రామ్‌ గోపాల్‌ వర్మ తన సినిమాను మే 25న కాకుండా జూన్‌ 1న విడుదల చేయబోతున్నట్లుగా నేడు ట్విట్టర్‌ ద్వారా ప్రకటించాడు. సినిమాకు కాస్త గ్రాఫిక్స్‌ టచ్‌ ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రేక్షకులకు సాంకేతికంగా ఆఫీసర్‌ను కొత్తగా చూపించేందుకు ఈ ఆలస్యం అంటూ వర్మ ట్వీట్‌ చేయడం జరిగింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంలో నాగార్జున మేకప్‌ లేకుండా సింపుల్‌గా కనిపించబోతున్నాడు. చాలా ఎక్కువ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని వర్మ స్వయంగా నిర్మించాడు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ చిత్రాన్ని ఓవర్సీస్‌లో భారీ ఎత్తున విడుదల చేస్తానంటూ వర్మ ప్రకటించాడు. మరో వైపు మే 25న ఈ చిత్రం విడుదల కాకపోవడంతో అదే రోజున విడుదల కాబోతున్న ‘నేల టికెట్‌’ మరియు ‘నా నువ్వే’ చిత్రాలకు కలిసి వస్తుంది.