Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
శ్రీదేవిని ఆరాధ్యదేవతగా కొలిచే ఆమె అభిమాని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, అతిలోకసుందరి జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్నారంటూ రెండు మూడు రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై వర్మ స్పందించాడు. ఈ వార్తలను ఖండించాడు. శ్రీదేవి జీవితచరిత్రపై నేను ఒక సినిమా తీస్తున్నానంటూ మీడియాలో ఓ వర్గం పేర్కొన్నదంతా అవాస్తవం. ఈ విధమైన ప్రయత్నం చేయడం కూడా మూర్ఖత్వమే అవుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే శ్రీదేవి పాత్రను పోషించే నటీమణి ఎక్కడాలేదు అని వర్మ ట్వీట్ చేశాడు. నిజానికి వర్మ కాకపోయినా… ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరు శ్రీదేవి పాత్రను తెరెకెక్కించే అవకాశముంది. ఎందుకంటే ఆమె జీవితంలో ఓ సినిమాకు సరిపడా మలుపులున్నాయి. నాలుగేళ్ల వయసులో నటించడం మొదలుపెట్టిన దగ్గరనుంచి కెమెరా, లైట్స్ వెంటే జీవితాంతం గడిపిన శ్రీదేవి… కెరీర్ పరంగా ఎవ్వరూ చేరని స్థాయికి చేరినా… వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా ఇబ్బందులు పడింది. అటు వృత్తిగతంగానూ తన పేరు, కీర్తి నిలుపుకునే క్రమంలో తీవ్ర ఒత్తిడికి లోనయింది. ఆమె జీవితమే కాదు… మరణమూ సంచలనమే.
20 ఏళ్లపాటు భారత చిత్ర పరిశ్రమను రారాణిగా ఏలిన శ్రీదేవి… 54 వయస్సులో అనుమానాస్పదంగా మరణించడం సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు ఎదుర్కొనే విషమపరిస్థితులకు నిదర్శనం. ఒక సావిత్రి, ఒక మధుబాల, ఒక శ్రీదేవి తమ జీవితంతోనూ, మరణంతోనూ భవిష్యత్ హీరోయిన్లకు ఎన్నో గుణపాఠాలు నేర్పివెళ్లారు.