Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ గురించి ప్రతి రోజు ఏదో ఒక వ్యాఖ్య చేస్తూ ఫుల్‌గా పబ్లిసిటీ చేస్తున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించబోతున్నట్లుగా వర్మ ప్రకటించిన విషయం తెల్సిందే. ఎన్టీఆర్ మరియు లక్ష్మి పార్వతిల పాత్రకు నటీనటులను ఎంపిక చేసినట్లుగా ప్రకటించిన వర్మ వారి వివరాలను ఇంకా వెళ్లడి చేయలేదు. ప్రస్తుతం వారికి మేకప్ టెస్ట్ మరియు స్క్రీన్ టెస్ట్‌ను నిర్వహిస్తున్నారు. వారు అందులో పాస్ అయితే త్వరలోనే వారి వివరాలను వెళ్లడి చేస్తాను అంటూ ఇటీవలే చెప్పుకొచ్చిన వర్మ తాజాగా మరో ఆసక్తికర ప్రకటన చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.
మొన్నటి వరకు టీడీపీ నాయకుల విమర్శలకు కౌంటర్ ఇస్తూ ఎంజాయ్ చేసిన వర్మ తాజాగా టీడీపీ నాయకులు సైలెంట్ అవ్వడంతో కొత్త పద్దతిలో తన సినిమాను పబ్లిసిటీ చేసేందుకు వ్యాఖ్యలు చేస్తున్నాడు. తాజాగా ఎన్టీఆర్ మాట్లాడుతూ ప్రతి రోజు తన కలలోకి ఎన్టీఆర్ వస్తున్నారని, ఆయన సూచనలు మరియు సలహాల మేరకు స్క్రిప్ట్‌ను సిద్దం చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ప్రతి రోజు ఆయన ఇచ్చిన సలహాలు మరియు సూచనలు తీసుకుని స్క్రిప్ట్‌ను రెడీ చేశాను అంటూ వర్మ పేర్కొన్నాడు. ఎన్టీఆర్ ఆశ్సీస్సులు నా సినిమాకు ఉన్నట్లుగా తాను భావిస్తున్నాను అంటూ వర్మ చెప్పుకొచ్చాడు.
వివాదాల వర్మ చేస్తున్న ఈ సినిమా తెలుగు దేశం పార్టీని టార్గెట్ చేసింది. త్వరలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వర్మ ఇలాంటి సినిమాను తీసి తమ పరువు తీస్తున్నాడని, పార్టీకి డ్యామేజ్ చేస్తున్నాడంటూ తెలుగు దేశం పార్టీ నాయకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. చంద్రబాబు నాయుడు కూడా ఈ సినిమాపై ఒకింత అసహనంతో ఉన్నాడు. పార్టీకి నష్టం ఖాయం అని వారు భావిస్తున్నారు. కొందరిని బాధ పెట్టే విధంగా ఈ సినిమా ఉంటుందని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే ప్రకటించాడు. దాంతో ఖచ్చితంగా సినిమా టీడీపీని టార్గెట్ చేసే విధంగా ఉంటుందని అంటున్నారు.