Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సందు దొరికితే పవన్‌పై విమర్శు చేస్తూ పబ్లిసిటీ పొందాలని వర్మ భావిస్తూ ఉంటాడేమో. అందుకే పవన్‌కు సంబంధించిన చిన్న విషయాలపై కూడా వర్మ ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటాడు. తాజాగా పవన్ కళ్యాణ్ తిరుమల తిరుపతి దేవస్థానంకు కాలినడకన వెళ్లడం జరిగింది. కాలినడకన ఏడుకొండలు ఎక్కుతున్న సమయంలో ఎవరైనా అలసి పోవడం చాలా సహజం. అలాగే పవన్ కళ్యాణ్ కూడా అలసి పోయి కాస్త విశ్రాంతి తీసుకునేందుకు కూర్చున్నాడు. ఆ సమయంలో తీసిన ఒక ఫొటోను రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి పవన్‌లో ఎనర్జీ ఇదేనా అంటూ ప్రశ్నించాడు.
వర్మ పోస్ట్ చేసిన ఆ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. పవన్‌ను ఈ విషయంలో కూడా వర్మ విమర్శించాలా అంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్మ దిగజారి మరీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని, ఆయనకు ఇంకా కూడా బుద్ది రావడం లేదంటూ మెగా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వర్మ ‘ఆఫీసర్’ చిత్ర ప్రమోషన్‌లో చాలా బిజీగా ఉన్నాడు. అయినా కూడా పవన్‌కు సంబంధించిన ఆ ఫొటోను పోస్ట్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది. వర్మ ఏం చేసినా చాలా విభిన్నం. అది కూడా పవన్‌పై చేసే ప్రతి విమర్శ కూడా చాలా వినూత్నంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ ఎనర్జీని ప్రశ్నించే స్థాయి వర్మకు లేదు అంటూ మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఆయన పోస్ట్‌కు రిప్లె పెడుతున్నారు.