ప్రముఖ వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇటీవల తెరకెక్కించిన చిత్రం కమ్మరాజ్యంలో కడప రెడ్లు… ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుత రాజకీయ పరిస్థితులని దృష్టిలో పెట్టుకొని తెరకెక్కించిన ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సిద్ధమయ్యారు కూడా. కాగా ఇటీవల విడుదలైన ట్రైలర్ ఎన్నో వివాదాలకు దారి తీసింది. రాష్ట్రంలోని రాజకీయ నాయకులందరితో పాటే, ప్రధాని, కేంద్ర హోంమంత్రి లను కూడా రాంగోపాల్ వర్మ తన సినిమా లో వాడుకున్నాడు మన రాంగోపాల్ వర్మ. అయితే ఇప్పటికే విడుదలైన వివాదాలతో పాటు మరికొన్ని వివాదాలుకూడా చుట్టుముడుతుండటంతో సినిమా విడుదల ఆగిపోయే పరిస్థితి వచ్చింది.
అయితే ఇక చేసేదేమి లేక రాంగోపాల్ వర్మ చివరికి వెనక్కి తగ్గేసాడు. కాగా విడుదలకి ఇంకా తక్కువ సమయం ఉంది కానీ, ఇప్పటికి కూడా ఈ చిత్రానికి సెన్సార్ కూడా అవలేదు ఇంకా. దానికితోడు హైకోర్టు కూడా ఈ చిత్రంపై వేసిన పిటీషన్‌ను నవంబర్ 28 కి వాయిదా వేసింది. ఇలాంటి పరిస్థితుల్లో రాంగోపాల్ వర్మ కాస్త వెనకడుగు వేశారు. తన చిత్రానికి సంబందించిన టైటిల్ మార్చడానికి సిద్ధమయ్యారు. అయితే ఈ సినిమాకు కమ్మరాజ్యంలో కడపరెడ్లు అని కాకుండా “అమ్మరాజ్యంలో కడపబిడ్డలు” అంటూ మార్చేసాడు. కాగా ఇదే విషయాన్నీ ఒక ప్రైవేట్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో అధికారికంగా ప్రకటించారు.