Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
సినీపరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న శ్రీరెడ్డికి రామ్ గోపాల్ వర్మ మరోసారి మద్దతుగా నిలిచారు. శ్రీరెడ్డి ప్రభావంతో శ్రీరెడ్డికి ముందు శ్రీరెడ్డికి తర్వాతగా తెలుగు సినీ పరిశ్రమ విడిపోతుందని, శ్రీ సునామి సృష్టించిందని వర్మ కొనియాడారు. శ్రీరెడ్డిని వర్మ చేగువేరాతో పోల్చారు. తిరుగుబాటుకు సంబంధించిన ఏ చర్య అయినా ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తుందని, ఏ కారణాల వల్ల వారు తిరుగుబాటు చేశారనే విషయాన్నిఒక మనిషిగా అర్దం చేసుకోవడానికి బదులు నెగటివ్ గా రియాక్ట్ అవుతారని, చేగువేరా చెప్పిన సత్యం ఇదేనంటూ శ్రీరెడ్డి, పవన్ కళ్యాణ్ పేర్లను ప్రస్తావించారు.
ఇలా జరగడం దురదృష్టకరమే అయినప్పటికీ ప్రస్తుతకాలంలో అనివార్యమయిందని వర్మ అభిప్రాయపడ్డారు. కాస్టింగ్ కౌచ్ కు వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టినదగ్గరనుంచి వర్మ శ్రీరెడ్డికి మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు. శ్రీరెడ్డి అర్ధనగ్న ప్రదర్శన తర్వాత పలు వర్గాల నుంచి ఆమెపై విమర్శలు వ్యక్తమయినా..వర్మ మాత్రం ఆమో పోరాటాన్ని సమర్థించారు. దేశవ్యాప్తంగా శ్రీరెడ్డి హాట్ టాపిక్ అయిందని ముంబైలో పవన్ కళ్యాణ్ గురించి తెలియని వాళ్లు కూడా శ్రీరెడ్డి గురించి మాట్లాడుకుంటున్నారని వర్మ ట్వీట్ చేశారు. ఆమె అర్ధనగ్న ప్రదర్శనను తప్పుపడుతున్న వాళ్లు ఓ విషయం గుర్తించాలని, ఆ ప్రదర్శన వల్లే టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ గురించి దేశవ్యాప్తంగా చర్చ జరగుతోందని వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.