Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి సంచలనంకు తెర లేపాడు. ఇప్పటి వరకు చాలా హాట్ సీన్స్‌ను, సెమీ న్యూడ్ సీన్స్‌ను తన సినిమాల్లో, షార్ట్ ఫిల్మ్‌లో చూపించిన వర్మ ఈసారి ఏకంగా పూర్తి న్యూడ్‌గా చూపించబోతున్నాడు. వర్మ ఒక చిత్రాన్ని వరల్డ్ ఫేమస్ పోర్న్ స్టార్‌తో తెరకెక్కించే ఏర్పాట్లు చేస్తున్నాడు. అందుకోసం యూరప్‌లో కొన్ని రోజుల పాటు చిత్రీకరణ కూడా జరిపారు. సన్నీలియోన్ తర్వాత పోర్న్ స్టార్‌గా ఆ రేంజ్‌లో గుర్తింపు దక్కించుకున్న మియా మల్కోవాతో వర్మ తన తాజా చిత్రాన్ని చేస్తున్నాడు.
వర్మ ట్విట్టర్ ద్వారా తన తాజా చిత్రంకు సంబంధించిన కొన్ని స్టిల్స్‌ను విడుదల చేశాడు. పూర్తి న్యూడ్‌గా ఉన్న మియా మల్కోవా ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో కంపు రేపుతున్నాయి. వర్మను ఫాలో అవుతున్న వారు అంతా కూడా ఏంది నాయన ఈ రచ్చ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మియా మల్కోవా కూడా తన ట్విట్వర్‌లో పలు న్యూడ్ ఫొటోలను పెట్టి వర్మను ట్యాగ్ చేసింది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను ఈనెల 16న విడుదల చేయబోతున్నట్లుగా వర్మ ప్రకటించాడు. ఇప్పటి వరకు ఎన్నో అద్బుతమైన చిత్రాలు తీసి ఇండియాస్ గ్రేట్ దర్శకుల్లో ఒక్కడిగా నిలిచిన వర్మ ఇప్పుడు న్యూడ్ చిత్రాన్ని చేయడం దారుణం అని, ఆయన ఈ సినిమా చేయకుండా ఉండాల్సింది అంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.