Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
అసలు వెంకయ్యకు ఉపరాష్ట్రపతి కావడం ఇష్టం లేదు. అయినా సరే మోడీకి ఎదురుచెప్పలేక సరే అన్నారు. పార్టీ కోసం తన రాజకీయ జీవితాన్ని పణంగా పెట్టాక కూడా రాం మాధవ్ లాంటి మధ్యలో వచ్చిన మహానుభావులు వెంకయ్యతో చెడుగుడు ఆడుతున్నారు. పదవులు మీడియా కట్టబెట్టదని, పార్టీ ఇస్తుందని, ఇందులో మూడోవారి జోక్యం అనవసరమని ఆయన మాట్లాడారు.
అంతకుముందు వెంకయ్య ప్రెస్ మీట్ పెట్టి.. తాను ఎందుకు వద్దన్నానో చెప్పడమే కాకుండా.. అధిష్ఠానం తప్పదని చెప్పడంతో.. ఒప్పుకున్నానని చెప్పారు. మరెవరికి పదవిచ్చినా ఎగిరి గంతేశారని, కానీ వెంకయ్య మాత్రం నిట్టూర్పులు విడుస్తారని అమిత్ షా ఆగ్రహంగా ఉన్నారు. అందుకే రాం మాధవ్ లాంటి వారిని ఉసిగొల్పారు.
ఇప్పుడు వెంకయ్య ఉపరాష్ట్రపతి అభ్యర్థని ఖాయమయ్యాక.. కాంగ్రెస్ ఆయనపై లేనిపోని విమర్శలు చేస్తోంది. ఎప్పుడో పాత విషయాలను తిరగదోడి కొత్తగా కనుగొన్నట్లుగా బిల్డప్ ఇస్తోంది. మన పత్రికలు వాటిని పట్టించుకోకపోయినా.. నేషనల్ మీడియా మాత్రం దుమ్ము రేపుతోంది. దీంతో వెంకయ్య ప్రెస్ మీట్ పెట్టి మరీ వాటిని కవర్ చేయడానికి నానా పాట్లు పడుతున్నారు.
మరిన్ని వార్తలు: