రామ్‌ కూడా ఆ ప్రయత్నం చేస్తున్నాడు…!

Ram Pothineni Unveils Song From Hello Guru Prema Kosame

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ ప్రస్తుతం ‘హలో గురూ ప్రేమకోసమే’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాలున్న ఈ చిత్రం షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. దసరాకు విడుదల చేసేందుకు నిర్మాత దిల్‌రాజు ఏర్పాట్లు చేస్తున్నాడు. యూత్‌ ఆడియన్స్‌ పల్స్‌ తెలిసిన దర్శకుడు త్రినాధరావు నక్కిన ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రంకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందిస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో రామ్‌తో ఒక పాటను దేవిశ్రీ పాడిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.

ram

గతంలో పవన్‌ కళ్యాణ్‌తో ‘అత్తారింటికి దారేది’ చిత్రం కోసం దేవిశ్రీ ఒక పాట పాడివ్వడం జరిగింది. ఆ తర్వాత ఎన్టీఆర్‌, రవితేజ, మహేష్‌బాబు ఇలా పలువురు హీరోలు తమ సినిమాల కోసం, ఇతర హీరోల హీరోల కూడా పాటలు పాడారు. ఇప్పుడు వారిదారిలోనే రామ్‌ కూడా నడిచేందుకు సిద్దం అయ్యాడు. ‘హలో గురూ ప్రేమకోసమే’ చిత్రంలో ఒక పాటను రామ్‌ పాడినట్లుగా సమాచారం అందుతుంది. సందర్బానుసారంగా వచ్చే ఆ పాటను రామ్‌ పాడితేనే బాగుంటుందని దేవిశ్రీ ప్రసాద్‌ భావించాడు. అందుకు దర్శకుడు త్రినాధ రావు నక్కిన మరియు నిర్మాత దిల్‌రాజులు ఒకే చెప్పడంతో రామ్‌ కూడా ఆసక్తిగా ఉండి పాడాడు. గతంలో హీరోలు పాటలు పాడిన సినిమాలు సక్సెస్‌ అయ్యాయి. మరి ఈ చిత్రం రామ్‌కు ఏ మేరకు సక్సెస్‌ను తెచ్చి పెడుతుందో చూడాలి.

hero-ram