రామ్‌ సాహసం చేస్తున్నాడా…?

Hello Guru Prema Kosame Movie To Get Release

యంగ్‌హీరో రామ్‌ గతేడాది ‘ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రంతో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. దాంతో ఒకమంచి హిట్‌ కోసం ఆరాటపడుతున్నాడు. ప్రస్తుతం ‘హలోగురు ప్రేమ కోసమే’ చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గోంటున్నాడు. ఈ చిత్రం ద్వారా ఎలాగైనా మంచి సక్సెస్‌ను సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు. ఇదివరకే పాటలు, ట్రైలర్‌ విడుదలయ్యాయి. కానీ వీటికి ఆశించినంత స్పందన రాలేదు. డైలాగ్స్‌ మాత్రం యూత్‌ని ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 18న దసరా సంద్భంగా విడుదల చేయనున్నారు. విడుదల కోసం చిత్ర యూనిట్‌ ఇప్పటికే సన్నాహాలు మొదలెట్టారు.

Ram Pothineni Unveils Song From Hello Guru Prema Kosame
దసరా సెలవులు ప్రారంభం అయిన నేపథ్యంలో ఎన్టీఆర్‌ నటించిన ‘అరవింత సమేత’ తాజాగా విడుదల అయ్యింది. మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. టాక్‌ ఎలా ఉన్నా కూడా ఇప్పటి వరకైతే కలెక్షన్లు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. కాబట్టి ఈ చిత్రం మరో మూడు వారాల వరకు హంగామా చేస్తుందని విశ్లేషకులు అంటున్నారు. కేవలం వారం గ్యాప్‌లోనే రామ్‌ ఎన్టీఆర్‌తో పోటీ పడడం సాహసమే అని వ్యాఖ్యానిస్తున్నారు. హిట్‌ కోసం రామ్‌ చాలా ట్రై చేస్తున్నాడు. మంచి కథను ఎంపిక చేసుకున్నా కూడా ఎన్టీఆర్‌తో పోటీ పడే సీన్‌ రామ్‌కు లేదని సినీ విశ్లేషకులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. యూత్‌ని అలరించే కథ కాబట్టి తప్పకుండా హిట్‌ అవుతుందరి దిల్‌రాజు గట్టిగా నమ్ముతున్నాడు. ఏది ఏమైనా ఎన్టీఆర్‌తో పోటీ పడడం వల్ల రామ్‌కు గట్టి దెబ్బ తగలనుందని సినీ వర్గాల వారంటున్నారు.

ram-movies

రామ్‌ సాహసం చేస్తున్నాడా...? - Telugu Bullet