Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
డేరా బాబా రేప్ కేసులో దోషిగా తేలడంతో ఆయన అనుచరులు ఎలా రెచ్చిపోయారో అందరం చూశాం. అసలు ఓ బాబాకు 200 కార్ల కాన్వాయ్ ఏంటనేది ఎవరికీ అర్థం కాలేదు. అప్పుడే జనాలు డేరా గురించి డీటైల్డ్ గా వెతకడం మొదలెట్టారు. గతంలో ఎంఎస్జీ సినిమా వచ్చినప్పుడు కొంత సెర్చ్ చేసిన నెటిజన్లు.. ఇప్పుడు పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే పనిలో పడ్డారు.
బాబాకు దేశవ్యాప్తంగా వందల కోట్ల ఆస్తులున్నాయి. ఆయనకు హైదరాబాద్ సమీపంలో కూడా 50 ఎకరాల ల్యాండ్ ఉందని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయవాడ జాతీయ రహదారి పక్కనే నల్గొండ దగ్గర యాభై ఎకరాలు కొన్న గుర్మీత్.. తన స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించారు. 2008లోనే ల్యాండ్ కొన్నా ఇంతవరకూ ఎవరూ వచ్చి చూసింది లేదని స్థానికులు చెబుతున్నారు.
గుర్మీత్ బాబా ఆస్తులు పైకి కనిపించేవి కొన్నేనని, ఆయనకు స్విస్ ఎకౌంట్లు ఉన్నాయని, చాలా మంది బినామీలున్నాయనే వాదన బయల్దేరింది. ఇప్పుడు ఆయన ఆస్తులపై కూడా ఎంక్వైరీ చేయాలని కొంతమంది కోర్టును ఆశ్రయించే పనిలో ఉన్నారు. అదే జరిగితే సిర్సా ఆశ్రమాన్ని మొత్తం వెతకాల్సి ఉంటుంది. అప్పుడే ఆయన లోగట్టు విప్పగలుగుతామని పోలీసులు అంచనా వేసుకుంటున్నారు.
మరిన్ని వార్తలు: