Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ప్రపంచ వ్యాప్తంగా మహమ్మదీయులు జరుపుకునే ఏకైక అతి పెద్ద పండుగ రంజాన్ లేదా రమదాన్. రంజాన్‌ను ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకుంటారు. రంజాన్ మానవాళికి హితాన్ని బోధించే పండుగగా వారు భావిస్తారు. ఇది ఒక మాసం మొత్తాన్ని వారు రంజాన్ మాసంగా భావించి వారు కఠోరవ్రతం పాటిస్తారు అలాంటి వారి కఠోరశ్రమకు పరిపూర్ణ ప్రతిఫలం రంజాన్ పర్వదినం రోజే లభిస్తుందని ముస్లింల విశ్వాసం. ఆ పర్వదినాన ఉదయం స్నానపానాదులు ముగించుకుని ప్రతి ఒక్కరూ కొత్త బట్టలు ధరించి అత్తరు పూసుకుని తక్బీర్ పఠిస్తూ ఈద్గాహ్ చేరుకుంటారు. పండుగ నమాజు(ప్రార్థన)ను ఊరిబయట నిర్ణీత ప్రదేశాలైన మసీదులలో చేస్తారు. నమాజ్ దుష్టచింతనల్ని, దురాగతాల్ని, కుహనా సంస్కారాన్ని ఎదుర్కోగలదని సత్ప్రవర్తనను నేర్పించగలదని వారి నమ్మకం. సత్ప్రవర్తన గల వ్యక్తి సర్వేశ్వరుని దృష్టిలో అందరికన్నా మిన్న అలాగే ఈద్ శ్రామికుని వేతనం లభించే రోజు అని ఖురాన్ విస్పష్టం చేసింది. ఈద్గాహ్లో నమాజ్ పూర్తి అయిన తర్వాత అక్కడ సమావేశమైన వారిలో వీలైనంత ఎక్కువ మందిని కలిసి సుహృద్భావంతో చేతులు కలుపుతారు.
మలినం లేని మంచి మనసులతో కౌగిలించుకుంటారు. ఈ పండుగను పేద, ధనిక తేడా లేకుండా అత్యంత భక్తి ప్రవత్తులతో జరుపుకుంటారు. అనంతరం ఒకరికొకరు ‘ఈద్‌ముబారక్ ‘ (శుభాకాంక్షలు) తెలుపుకుంటారు. ఈ నమాజ్ కోసము వెళ్లే ముస్లిం సోదరులు ఒక దారిన వచ్చి మరో దారిన వెళ్తారు. ఇంకా రంజాన్ మాసంలో జరిగే ‘ ఇఫ్తార్ విందు’ల్లో ఆత్మీయత మనందరం గమనించే ఉంటాం. ఇప్పుడైతే రాజకీయ నాయకులు ముస్లిం వోట్ల కోసం ఇఫ్తార్ విందులలో పాల్గొంటున్నారు కానీ ఎప్పటినుండో హిందూ ముస్లిం సోదరులు ఇలా కలిసి రంజాన్ చేసుకుంటున్నారు. తెలుగు వారి మాదిరిగానే ముస్లింలు ‘చాంద్రమాన కేలండర్’ ను అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెల ‘రంజాన్’, దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం ‘ దివ్య ఖురాన్’ గ్రంథం ఈ మాసంలో అవిర్భవించడమే. ఇదండీ క్లుప్తంగా రంజాన్ అంటే ఏంటో.