Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
Rana Daggubati Praises Baahubali Prabhas As Biggest Indian Superstar
బాహుబలిపై భల్లాల దేవ ప్రశంసల వర్షం కురిపించాడు. జీవితంలో ఇప్పటివరకూ కలవని ఓ మంచి వ్యక్తి అంటూ బాహుబలిని ప్రశంసించాడు భల్లాలదేవ. బాహుబలి, భల్లాలదేవ పాత్రల్లో ఒదిగిపోయి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు ప్రభాస్,రానా. బాహుబలి షూటింగ్ సమయంలో ప్రభాస్ తో తనకు ఏర్పడిన బంధం గురించి ఓ ఇంటర్వ్యూలో వివరించాడు రానా.
ప్రభాస్ కు ఉన్నతమైన ఆశయాలు, లక్ష్యాలు లేవని, సినిమాను ప్రేమిస్తూ దానికోసం ఏమైనా చేయటానికి సిద్దపడే వ్యక్తని రానా చెప్పాడు. ఓ సినిమా కోసం ఒక నటుడు తన కెరీర్ లో 5 నుంచి 6 ఏళ్ల సమయాన్ని కేటాయించడం నమ్మలేని విషయమన్న రానా… ప్రభాస్ సినిమా కోసం ఏదైనా చేస్తారనడానికి ఇదే నిదర్శనమన్నాడు. బాహుబలి షూటింగ్ లో చాలాసార్లు తడబడ్డామని, కానీ ప్రభాస్ సినిమాకు మూలస్తంభంలా నిలబడ్డాడని రానా ప్రశంసించాడు సెట్ లో అందరినీ నిరంతరం ప్రేరేపించే వ్యక్తుల్లో ప్రభాస్ ఒకరని రానా చెప్పాడు.
సెట్ లో రాజమౌళిని డార్లింగ్ అని సంభోదిస్తూ ప్రభాస్ చాలా జోవియల్ గా ఉండేవాడని, డార్లింగ్ ఎలాంటి సినిమా చేస్తున్నామో తెలుసా…? ఇంటర్నేషనల్ సినిమా చేస్తున్నాం డార్లింగ్ అని పదే పదే డైరెక్టర్ తో చెప్తుండేవాడని రానా తెలిపాడు. బాహుబలి సినిమాను ప్రభాస్ నిజాయితీగా నమ్మాడని రానా వ్యాఖ్యానించాడు.
మరిన్ని వార్తలు:
-
‘ఫిదా’ కంటే పెద్ద హిట్!
-
మోక్షజ్ఞ లవ్ స్టోరీ కి అతనే కర్త,కర్మ,క్రియ ?
-
బాలయ్యకు ఎలా పిలిస్తే ఇష్టమో తెలుసా?