సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు ఒక హీరో చేయాల్సి ఉండగా మరో హీరో చేసినట్లుగా మనం వార్తల్లో చూస్తూనే ఉంటాం. ఒక హీరో వద్దకు వెళ్లి ప్రాజెక్ట్ డేట్లు లేకపోవడం వ్ల మరో హీరో వద్దకు వెళ్లిన ప్రాజెక్ట్‌లు చాలా ఉన్నాయి. ఇక ఒక హీరో నమ్మని సబ్జెక్ట్‌ను మరో హీరో నమ్మి చేసి సక్సెస్‌లు దక్కించుకున్న సందర్బాలు కూడా చాలా ఉన్నాయి మొదటి సందర్బం కారణంగా రానా ‘పటాస్’ వంటి మంచి సినిమాను మిస్ చేసుకున్నాడు. ‘బాహుబలి’ సమయంలో ‘పటాస్’ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్‌లో నిర్మించేందుకు సురేష్‌బాబు ప్రయత్నాలు చేశాడు. అనీల్ రావిపూడి తీసుకు వచ్చిన కథకు తన టీంతో తుది మెరుగులు అద్దించడం జరిగింది. అదే సమయంలో రానాతో స్క్రిప్ట్ చర్చలు కూడా జరిపారు. కాని అనూహ్యంగా బాహుబలి చిత్రం ఆలస్యం అవ్వడంతో దర్శకుడు అనీల్ రావిపూడి ఆ చిత్రంను కళ్యాణ్ రామ్‌తో చేయించాడు.
కళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే అతి పెద్ద సూపర్ హిట్‌గా ‘పటాస్’ నిలిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. భారీ ఎత్తున సినిమా వసూళ్లను రాబట్టడంతో పాటు కళ్యాణ్ కెరీర్‌లోనే నిలిచి పోయింది. తాజాగా కేరాఫ్ కంచెరపాలెం చిత్రంను నిర్మించిన రానా ఆ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా మాట్లాడుతూ పటాస్‌ను మిస్ చేసుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. రానా కెరీర్‌లో ఇప్పటి వరకు హీరోగా మంచి కమర్షియల్ సక్సెస్‌ను దక్కించుకోలేదు. కనీసం పటాస్‌తో అయినా రానాకు మంచి బ్రేక్ దక్కేది. కాని కళ్యాణ్ రామ్ ఆ ప్రాజెక్ట్‌ను మిస్ చేసుకుని కెరీర్‌లో అతి పెద్ద తప్పు చేశాడు అంటూ టాక్ వినిపిస్తుంది. రానా కూడా అదే ఫీలింగ్‌తో ఉన్నట్లుగా తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలతో అర్థం అవుతుంది.