తెలుగు ప్రేక్షకుల మంచి సినిమాలకు మొహం వాచి ఉన్నారు. గత కొన్ని వారాలుగా పాత సినిమాలనే మళ్లీ మళ్లీ చూస్తూ ఉన్నారు. వేసవి ఆరంభంలో వచ్చిన ‘రంగస్థలం’ చిత్రం మరియు సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన ‘మహానటి’ చిత్రాలే ఇంకా కూడా థియేటర్లలో ఆడుతున్నాయి. ఈ రెండు చిత్రాల తర్వాత ఎన్నో చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కాని అందులో ఒకటి రెండు పర్వాలేదు అనిపించినా కూడా మాస్ ఆడియన్స్ను మాత్రం మెప్పించలేక పోయాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కుటుంబ సమేతంగా సినిమాకు వెళ్లాలి అంటే ఈ రెండు సినిమాలకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు.
ఈ రెండు చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టాయి. ఇంకా కూడా పలు థియేటర్లలో ఈ చిత్రాలు ప్రదర్శింపబడుతున్నాయి. మాస్ ఆడియన్స్ ఈ చిత్రాలు ఆకట్టుకున్నంతగా ఇటీవల విడుదలైన ఏ చిత్రాలు కూడా ఆకట్టుకోలేక పోతున్నాయి. అందుకే ఈ చిత్రాలు థియేటర్ల అక్యూపెన్సీ ఇంకా కూడా భారీగానే ఉంటుంది. చూస్తుంటే ఈ రెండు చిత్రాలు వంద రోజులు పూర్తి చేసుకుని సరికొత్త రికార్డును నమోదు చేస్తాయేమో అనిపిస్తుంది. రంగస్థలం చిత్రంతో రామ్ చరణ్, సుకుమార్లు ప్రేక్షకులను మైమరపించారు, ఇక మహానటి జీవితాన్ని నాగ్ అశ్విన్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి సరికొత్త చరిత్రను ఆవిష్కరించాడు. ఈ రెండు సినిమాలు కూడా ఊహించని వసూళ్లను రాబట్టాయి.