Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
రామ్ చరణ్, సుకుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘రంగస్థలం’ చిత్రం విడుదలకు కౌంట్ డౌన్ ప్రారంభం అయ్యింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను రేపు వైజాగ్‌లో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వైజాగ్ ఆర్కే బీచ్‌లో శ్రేయాస్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ భారీ ఎత్తున ప్రీ రిలీజ్ వేడుక ఏర్పాట్లు చేసింది. మెగా ఫ్యామిలీ హీరోలు పలువురు ఈ వేడుకలో పాల్గొనబోతున్నట్లుగా ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఇప్పటికే చిత్ర యూనిట్ సభ్యులు వైజాగ్ చేరుకున్నట్లుగా సమాచారం అందుతుంది. మెగాస్టార్ చిరంజీవితో పాటు చరణ్, సుకుమార్‌లు ఈరోజు రాత్రికి లేదా రేపు ఉదయం వైజాగ్ చేరుకోబోతున్నారు.
దేవిశ్రీ ప్రసాద్ మరియు ఆయన టీం ఇప్పటికే వైజాగ్ చేరుకుని ఏర్పాట్లలో మునిగిపోయినట్లుగా సమాచారం అందుతుంది. మొత్తానికి వైజాగ్ మెగా ఫ్యాన్స్‌కు కన్నుల పండుగగా రంగస్థలం చిత్రం ప్రీ రిలీజ్ వేడుక జరుగబోతుంది. చరణ్ సినీ వేడుక మొదటి సారి వైజాగ్‌లో భారీ ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో సినీ వర్గాల దృష్టి కూడా ఈ వేడుకపై ఉంది. ఏపీ పోలీసు అధికారులు మరియు రెవిన్యూ అధికారులు ఈ కార్యక్రమంకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మంత్రి గంటా శ్రీనివాస్ కూడా ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరు కానున్నట్లుగా తెలుస్తోంది. ప్రీ రిలీజ్ వేడుకలో సినిమా ట్రైలర్‌ను విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ చిత్రం ట్రైలర్ కోసం సినీ వర్గాల వారు మరియు మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.