బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ మరియు స్టార్ హీరోయిన్ దీపిక పదుకునేలు తాజాగా ఇటలీలోని లేక్ వ్యూ లో భారీ ఎత్తున వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. వీరి వివాహం అత్యంత వైభంగా కొంకణీ మరియు సింథి సాంప్రదాయాల ప్రకారం జరిగింది. ఈనెల 14 మరియు 15వ తేదీన జరిగిన వీరి వివాహం సమయంలో సింథి సాంప్రదాయంను పట్టించుకోకుండా తమ ఇష్టానుసారంగా ప్రవర్తించారు అంటూ మత పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వివాహం తర్వాత వేడుకల్లో బిజీగా గడిపేస్తున్న ఈ స్టార్ కపుల్ మత పెద్దల ఆగ్రహంతో టెన్షన్ పడుతున్నట్లుగా తెలుస్తోంది. పెళ్లి సందర్బంగా సింథి పద్దతికి వ్యతిరేకంగా చేశారని, ప్రముఖులైనంత మాత్రాన ఎలా అయినా చేయవచ్చు అనుకున్నారా అంటూ రణ్‌వీర్ సింగ్‌ను మత పెద్దలు ప్రశ్నిస్తున్నారు.
మత గ్రంధం విషయంలో ఈ వివాదం జరుగుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కొత్త జంట క్షమాపణలు చెబితే ఈ వివాదం సర్దుమణుగుతుందా లేదంటే ఇంకాస్త సీరియస్ అవుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారీ ఎత్తున వీరి వివాహ రిసెప్షన్ వేడుకకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో వివాదంలో పెళ్లి చిక్కుకోవడంతో బాలీవుడ్ స్టార్స్ కూడా కాస్త నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం ఇంకా పెద్దగా కాకుండా ఉండేలా బాలీవుడ్ ప్రముఖులు మరియు రణ్‌వీర్ సింగ్ కుటుంబ సభ్యులు కూడా మత పెద్దలతో మాట్లాడుతున్నట్లుగా సమాచారం అందుతోంది. రేపు బెంగళూరులో వీరి వివాహ రిసెప్షన్ భారీ ఎత్తున జరుగబోతుంది.