క‌పిల్ దేవ్‌గా మారిన ర‌ణ్‌వీర్.. ఆక‌ట్టుకుంటున్న ఫ‌స్ట్ లుక్

ranveer changed as kapildev

బాలీవుడ్‌లో స్పోర్ట్స్ డ్రామా నేప‌థ్యంతో తెర‌కెక్కుతున్న చిత్రం 83. 1983 వరల్డ్‌కప్ ఫైనల్లో అప్పటి డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్‌ను ఓడించి తొలిసారి టీమిండియా విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ టీమ్ సక్సెస్ స్టోరీ ఆధారంగా 83 మూవీ రూపొందుతుంది. హిందీ, తెలుగుతో పాటు పలు భాషలలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్. చిత్రంలో క‌పిల్ దేవ్ పాత్ర‌ని ర‌ణ్‌వీర్ సింగ్ పోషిస్తుండ‌గా, ఆయ‌న‌కి సంబంధించిన లుక్‌ని తాజాగా విడుద‌ల చేశారు. క‌పిల్ దేవ్‌గా ర‌ణ్‌వీర్ లుక్ అదిరిపోయింద‌ని నెటిజ‌న్స్ ప్ర‌శంసిస్తున్నారు. చిత్రంలో దీపిక.. రోమి దేవ్ అనే పాత్ర‌లో ర‌ణ్‌వీర్‌కి భార్య‌గా కనిపించ‌నుంది. క్రికెటర్ కృష్ణ‌మాచారి శ్రీకాంత్ పాత్ర‌లో త‌మిళ న‌టుడు జీవా న‌టిస్తున్నాడు. నవాజుద్దీన్ సిద్దిఖీ ..రణ్ వీర్ సింగ్‌కి కోచ్ గా నటించనున్నారు. 2020 ఏప్రిల్ 10న‌ గుడ్ ఫ్రైడే రోజు క‌పిల్ దేవ్ బ‌యోపిక్ చిత్రంని విడుద‌ల చేయ‌నున్నారు. మ‌ధు మంతెన‌, విష్ణు ఇందూరి, ఖాన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పంక‌జ్ త్రిపాఠి, తాహిర్ ఆజ్ భాసిన్‌, స‌కీబ్ స‌లీమ్, చిరాగ్ ప‌టిల్‌, అదినాథ్ కొఠారే, ధైర్య క‌ర్వా, దిన‌క‌ర్ శ‌ర్మ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ లండన్‌లో జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తుంది.