కన్నకూతురుపై తండ్రి అత్యాచారం.. ఆపై బయటికి చెప్తే చంపేస్తానని బెదిరింపు..

20-year-old- girl gang-rape-in-chittoor

తెలంగాణలోని వికారాబాద్ లో ఘోరం వెలుగు చూసింది. వావి వరుసలు లేకుండా కామంతో రెచ్చపోయిన కన్నతండ్రే కూతురును రేప్ చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. కన్నకూతురిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రే కీచకుడిగా మారిన తీరు చూసి ప్రజలు విస్తుపోతున్నారు.  తాజాగా వికారాబాద్ సమీపంలోని తాండూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక తల్లి పదేళ్ల క్రితం చనిపోయింది. దీంతో తండ్రి మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. అయితే కన్న కూతురును దోమ మండలంలోని ఓ పాఠశాలలో ఉంచి చదివిస్తున్నాడు. మార్చిలో లాక్‌డౌన్‌ కారణంగా కూతురు ఇంటికి వచ్చింది. కామంతో రెచ్చిపోయిన తండ్రి వావి వారుసలు మర్చిపోయి కన్న కూతురు అన్న సోయకూడా లేకుండా ఆమెపైనేవ కన్నేశాడు. ఇక రంజాన్ రోజున ఇంట్లో ఎవరూ లేని సమయంలో చూసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించడంతో బాధితురాలు మౌనంగా ఉండిపోయింది.

అయితే బాలిక రెండ్రోజుల క్రితం హైదరాబాద్‌లోని పెద్దమ్మ ఇంటికి వచ్చింది. ఆమె దీనంగా ఉండటాన్ని గమనించిన పెద్దమ్మ ఏం జరిగిందని అడిగింది. తన తండ్రే కామంతో జరిపిన అఘాయిత్యాన్ని గురించి వెల్లడించింది. దీంతో ఆమె గ్రామానికి చేరుకుని బాలిక నాయనమ్మకు విషయం తెలిపింది. ఇక బంధువులంతా కలిసి కలిసి ఆ కీచక తండ్రిని నిలదీశారు. ఆ తర్వాత తాండూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా అతడిని అరెస్ట్ చేశారు. కాగా బాలికను వైద్య పరీక్షల కోసం వికారాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఎన్ని చట్టాలున్నప్పటికీ.. కామంతో కళ్లు కప్పుకుపోయిన పురుషులు ఇంకా తమ అఘాయిత్యాలను కొనసాగిస్తుండటం అదీ కన్న కూతుళ్లపైనే అత్యాచారాలకు పాల్పడటంతో సమాజం షాక్ కి గురౌతుంది.