పనుల కోసం పలు రాష్ట్రాల నుంచి పల్లెల నుంచి జనాలు పట్టణాలకు వస్తుంటారు. ముఖ్యంగా ఉపాధి కోసం ఉత్తరాది రాష్ట్రం నుంచి తమిళనాడుకు వచ్చిన ఓ యువతి కామాంధుల చేతిలో చిక్కి అల్లల్లాడిపోయింది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. తమిళనాడులోని తంజావూరు జిల్లాలో ఓ యువతిని ముగ్గురు కామాంధులు కిడ్నాప్ చేసి కారులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను కారులో నుంచి తోసేసి పారిపోయారు. దీంతో బాధితురాలి మెల్లిగా పోలీసులను ఆశ్రయించింది. అయితే పోలీసులు వాంగ్మూలంలో ఆ ఘటనకు ముందే యజమాని చేతిలో దారుణంగా మోసపోయిన విషయం కూడా వెలుగులోకి వచ్చింది.
అయితే ఉత్తరాది నుంచి ఓ కుటుంబం కర్ణాటకలోని బెంగళూరుకు వలస వచ్చింది. వారికి ఓ కూతురు ఉంది. ఓ ఇంట్లో పనిచేసేందుకు ఆమె ఐదు నెలల క్రితం తమిళనాడులోని తంజావూరుకు వెళ్లింది. అయితే ఆమె పనిచేసే ఇంటి యజమాని సెంథిల్‌కుమార్ ఆమెను లైంగికంగా వేధించడం స్టార్ట్ చేశాడు. అలా కొద్దిరోజుల గడచిన తర్వాత ఆ యువతిని వ్యభిచార వృత్తిలోకి దించాడు. విటులను తీసుకొచ్చి ఆమెతో బలవంతంగా వ్యభిచారం చేయించేవాడు. దీంతో అతడి బారి నుంచి తప్పించు కోవడానికి అనేకమార్లు బాధితురాలు ప్రయత్నించి విఫలమైంది.