హైదరాబాద్ లో దారుణం బాలుడి మీద రేప్ ?

rape on a boy in hyderabad

హైదరాబాద్ పాతబస్తీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కామంతో కళ్లుమూసుకుపోయిన ఓ వ్యక్తి ఏమి చేస్తున్నానో తెలీక పద్నాగేళ్ల బాలుడిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గోల్కొండ ప్రాంతంలో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న పద్నాగేళ్ల బాలుడిని ఆదివారం నాడు పక్కింట్లో ఉండే అర్షద్ నదీం అనే వ్యక్తి ఏదో సాయం కోసం పిలిచాడు. తల్లిదండ్రులు ఇంట్లో లేకపోవడంతో అర్షద్ పిలవగానే బాలుడు అతడి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న అర్షద్ బాలుడిని నిర్బంధించాడు. అనంతరం అతడిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ కామాంధుడి నుంచి తప్పించుకునేందుకు బాలుడు ప్రయత్నించగా అర్షద్ తీవ్రంగా కొట్టాడు. తనపై జరిగిన అఘాయిత్యాన్ని తర్వాత బాలుడు తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసుకున్న గోల్కొండ పోలీసులు నిందితుడు అర్షద్ కోసం గాలిస్తున్నారు. బాలుడిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.