Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మైనర్ బాలికపై అత్యాచారం కేసులో వివాదస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపును జోధ్పూర్ ప్రత్యేక కోర్టు దోషిగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ఆయన్ను దోషిగా నిర్ధరించిన న్యాయస్థానం యావజ్జీవిత ఖైదును విధించింది. మరో ఇద్దరు నిందితులకు 20 ఏళ్ల చొప్పున శిక్షలను ఖరారుచేసింది. జోధ్పూర్ సెంట్రల్ జైలులో ఏర్పాటుచేసిన ప్రత్యేక గదిలో ఈ కేసుకు సంబంధించి జరిగిన తుది విచారణ అనంతరం జస్టిస్ మధుసూదన్ శర్మ ఆశారాం, మరో ముగ్గురు వ్యక్తులను దోషులుగా తేల్చుతూ తీర్పు వెల్లడించారు. మహిళలపై అత్యాచారానికి పాల్పడిన గుర్మీత్ రహీమ్ బాబాను గత ఆగస్టులో దోషిగా ప్రకటించిన తర్వాత హరియాణా, పంజాబ్లో హింస చెలరేగడంతో అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండేందుకు ఈ కేసును జైల్లోనే విచారణ చేపట్టి, తీర్పు వెల్లడించారు.
ఆశారాం అనుచరులు ఎలాంటి విధ్వంసాలకు పాల్పడకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. ఈ కేసులో కొందరి సాక్ష్యం కీలకంగా మారాయి అలాంటి వారిలో రాహుల్ సచార్ వాంగ్మూలం అసారాంకు శిక్ష పడేలా చేసింది. ఆసారాం మాజీ శిష్యుడు రాహుల్ కే సచార్ జోధ్ పూర్ కోర్టులో ఇచ్చిన వాంగ్మూలంలో షాకింగ్ అంశాల్ని వెల్లడించిన వైనం తాజాగా బయటకు వచ్చింది. రాజస్తాన్ లోని పుష్కర్… హర్యానాలోని భివానీ… గుజరాత్ లోని అహ్మదాబాద్ ఆశ్రమాల్లో బాలికల్ని వేధించటం తాను చూసినట్లుగా రాహుల్ వెల్లడించారు. ఆశ్రమంలో ఆశారాం వెంట ముగ్గురు బాలికలు ఉండేవారని… వారితో ఆశ్రమంలో తిరుగుతూ టార్చిలైట్ తో సైగలు చేసేవాడన్నారు. అలా బాలికను ఎంపిక చేసిన తర్వాత… ముగ్గురు బాలికలు కలిసి ఆ బాలికను ఆశారాం ఆశ్రమంలోకి తీసుకెళ్లేవారని చెప్పారు. లైంగిక వేధింపులకు గురైన బాలికలకు గర్బస్రావాల్ని చేయించటం కూడా ఆ ముగ్గురు బాలికలే బాధ్యత తీసుకునేవారని చెప్పారు. ఒకసారి ఒక బాలికను వేధిస్తున్న సమయంలో ఆశారాంని తాను ప్రశ్నించినట్లు రాహుల్ చెప్పారు. దీనికి బదులుగా బ్రహ్మజ్ఞాని ఇలాంటివి చేయటం తప్పు కాదని, అది తన హక్కు అన్నట్లు ఆయన ప్రవర్తించేవాడట.
ఆశారాం లైంగిక వేధింపుల్ని ప్రశ్నించినందుకు తనను ఆశ్రమం నుంచి బయటకు పంపేశారని… ఆ తర్వాత దాడికి పాల్పడినట్లు చెప్పారు. లైంగిక సామర్థ్యం పెంచుకోవటం కోసం గంజాయితో పాటు ఇతర మత్తుమందుల్ని కూడా వాడేవాడని చెప్పారు. ఆయన ఒక్కరే కాక ఈ కేసులో మరో వ్యక్తి సాక్ష్యం కూడా కీలకం అని చెప్పవచ్చు ఆయనే సతీష్ వాద్వానీ. డ్రైవర్ గా, వంట మనిషిగా, బాడీగార్డుగా ఆశారాం వద్ద సుదీర్ఘ కాలం పాటు పనిచేశాడు సతీష్. అయితే ఆశ్రమంలో చిన్నారుల పై లైంగిక దాడుల విషయాన్ని ఆశారాంని ప్రశ్నించాడు. దీంతో తనపై ఆశారాంతో పాటు ఆయన కొడుకు దాడికి దిగారని సతీష్ తెలిపాడు. పదేళ్ళపాటు ఆశారాం ఆశ్రమంలో ఈ దారుణాలను తాను ప్రత్యక్షంగా చూశానని ఆయన చెప్పారు. సూర్యాస్తమయం తర్వాత ఆడపిల్లలకు ఆశ్రమంలో ప్రవేశం లేదని ఇండోర్ స్టేడియం ముందు రాసి ఉంటుంది. అయితే అర్థరాత్రి తర్వాత వెనుక గేటు నుంచి పలువురు బాలికలు వచ్చి మెడిటేషన్ గదుల్లో గడిపేవారని ఆశారాం వద్ద గతంలో డ్రైవర్గా పనిచేసిన సతీష్ చెప్పారు. అయితే అనేక సార్లు వెనుక గేటు నుండి ఆశ్రమంలోకి వచ్చే అమ్మాయిలను తాను స్వయంగా వెనక్కి పంపించినట్టు ఆయన గుర్తు చేసుకొన్నారు. మొత్తానికి ఆ పాపం ఇన్నాళ్ళకి పండింది.