Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఉగాది సందర్బంగా ఈటీవీలో ప్రసారం అయిన రష్మీ, సుధీర్ల వివాహ కార్యక్రమం ఆహా నా పెళ్లంటకు అనూహ్యంగా భారీ ఆధరణ దక్కింది. జబర్దస్త్ స్టార్స్ మరియు డీ స్టార్స్ అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేయడం జరిగింది. కామెడీ స్కిట్స్‌తో పాటు, డాన్స్‌లతో అలరించారు. అన్నింటి కంటే కూడా రష్మీ, సుధీర్ల ప్రేమ, పెళ్లి సన్నివేశాలు కార్యక్రమం స్థాయిని అమాంతం పెంచేశాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఆ కార్యక్రమంకు సంబంధించిన క్లిప్పింగ్స్ తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఈ సమయంలోనే కొందరు వారిద్దరికి నిజంగానే పెళ్లి అయ్యిందని, వారిద్దరి మద్య ప్రేమ వ్యవహారం సాగుతుందని భావిస్తున్నారు. కాని ఆ వాదనను రష్మీ మరియు సుధీర్‌లు కొట్టి పారేస్తున్నారు.
తాజాగా సోషల్ మీడియాలో కొందరు ప్రేక్షకులను ఇలా మోసం చేయడం ఎంత వరకు కరెక్ట్, మీ ఇద్దరిపై ఇప్పటికే పుకార్లు భారీ ఎత్తున వస్తుండగా మీరు మళ్లీ ఆ పుకార్లకు ఊతం ఇచ్చేలా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అంటూ రష్మీ మరియు సుధీర్లను ప్రశ్నించారు. అందుకు రష్మీ సమాధానం ఇచ్చింది. తమ జంటకు క్రేజ్ ఉన్న కారణంగానే తమతో నిర్వాహకులు ఆ కార్యక్రమాన్ని చేశారని, హీరో హీరోయిన్స్ జంటకు ఎక్కువ క్రేజ్ ఉంటే వారినే ఎక్కువ సినిమాల్లో రిపీట్ చేస్తారు. అలాగే తమ జంట ప్రధానంగా ఆ కార్యక్రమం జరిగిందని, తాము నటీ నటులం అని, ఎలాంటి పాత్రలనైనా, ఎలాంటి సీన్స్‌లో అయినా నటించేందుకు సిద్దంగా ఉంటామని, తాము ఆ షోలో చేసింది కూడా నటనే అంటూ రష్మీ చెప్పుకొచ్చింది. తాము చేసిన దాంట్లో ఎంత మాత్రం తప్పు లేదని చెప్పుకొచ్చింది. కాస్త అటు ఇటుగా సుధీర్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశాడు.