Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
జబర్దస్త్ కారణంగా ఎంతో మంది స్టార్స్, సెలబ్రెటీలు అయ్యారు. వారిలో సుడిగాలి సుధీర్ కూడా ఉన్నాడు. జబర్దస్త్‌కు ముందు అసలు ఇతడు ఎవరో, ఏం చేసేవాడో ఎవరికి తెలియదు. కాని జబర్దస్త్ తర్వాత సుడిగాలి సుధీర్ స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. సెలబ్రెటీల గురించి సోషల్ మీడియాలో ప్రచారం జరగడం సర్వ సాధారణం. అలాగే సుడిగాలి సుధీర్ గురించి కూడా పుకార్లు మొదలు అయ్యాయి. సుడిగాలి సుధీర్ మరియు యాంకర్ రష్మీల మద్య ప్రేమ వ్యవహారం సాగుతుందని, ఇద్దరు పెళ్లి చేసుకునేందుకు కూడా సిద్దం అవుతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. టీవీ షోల్లో వీరిద్దరు వ్యవహరిస్తున్న తీరు మరియు వీరిద్దరి ప్రవర్తన మీడియాలో వస్తున్న వార్తలు నిజమేనేమో అనిపిస్తుంది.
దాదాపు రెండు మూడు సంవత్సరాలుగా వీరిద్దరి మద్య అఫైర్ గురించి మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఎప్పటికప్పుడు ఇద్దరు కూడా ఆ వార్తలను కొట్టి పారేస్తూ వస్తున్నారు. వారి గురించి ప్రచారం జరుగుతున్నా కూడా ఇద్దరి ప్రవర్తనలో మార్పు రాలేదు. దాంతో ఇద్దరి మద్య వ్యవహారం గురించి మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా వీరిద్దరు ఒక షోకు యాంకర్స్‌గా వ్యవహరిస్తున్నారు. ఆ సందర్బంగా వీరిద్దరు మరీ రెచ్చి పోయి ప్రవర్తిస్తున్నారు. దాంతో వీరి వివాహం గురించి, ప్రేమ వ్యవహారం గురించి చర్చలు జరుగుతున్నాయి. తాజాగా రష్మీని ఒక అభిమాని నేరుగా మీరిద్దరు వివాహం చేసుకుంటారా అంటూ ప్రశ్నించాడు.
సోషల్ మీడియాలో ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు రష్మీ సమాధానంగా మా ఇద్దరి మద్య ప్రేమ లేదు దోమ లేదు. ఇద్దరి మద్య సంభాషణలు ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేసేందుకు మేము మా ఇద్దరి మద్య ఏదో ఉన్నట్లుగా ప్రవర్తిస్తున్నాం అంతే తప్ప మా ఇద్దరి మద్య ప్రత్యేకమైన సంబంధం ఏమీ లేదని చెప్పుకొచ్చింది. ఇతర కమెడియన్స్‌తో ఎలా ఉంటానో ఆఫ్ స్క్రీన్‌లో సుధీర్‌తో కూడా అలాగే ఉంటాను అంటూ చెప్పుకొచ్చింది. మా ఇద్దరి మద్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతుందనే ఉద్దేశ్యంతో షో నిర్వాహకులు మమ్ములను హోస్ట్‌లుగా పెడుతున్నారు అంతే అంటూ క్లారిటీ ఇచ్చేసింది.