విజయ్ తో రష్మిక తమిళ తొలి సినిమా విశేషాలివే…!

Rashmika Mandanna In Vijay Atlee Film

రష్మిక మందన్న – ఇప్పుడు ఈ పేరు తెలుగు యువ ప్రేక్షకుల అభిమాన నటిగా, అందాల దేవతగా మారుమ్రోగిపోతుంది. కన్నడ భామ అయిన రష్మిక మందన్న తన తొలి కన్నడ చిత్రం కిరిక్ పార్టీ తో కన్నడ లో స్టార్ స్టేటస్ దక్కించుకొని, కన్నడ స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తుంది. కిరిక్ పార్టీ సినిమా సమయంలోనే ఆ సినిమా కథానాయకుడు అయిన రక్షిత్ శెట్టి తో పీకల్లోతు ప్రేమలో పడిపోయి, ఎంగేజ్మెంట్ కూడా చేసేసుకున్న రష్మిక ఆ తరువాత తన తొలి తెలుగు చిత్రం ఛలో, మలి చిత్రం గీత గోవిందం లు సూపర్ హిట్లు అవ్వడంతో, తన కెరీర్ కోసం కొన్ని కారణాల చేత తాను మనువాడదలచిన రక్షిత్ శెట్టి తో వివాహం కూడా క్యాన్సిల్ చేసుకుంది. తన మూడో తెలుగు సినిమా లో నాని కి జతగా చేసిన దేవ్ దాస్ సినిమా కూడా మంచి విజయం సాధించడంతో పాటు, విజయ్ దేవరకొండ తో మరో రెండు తెలుగు సినిమాలు, నితిన్ తో భీష్మా మరియు ఇంకో రెండు పెద్ద కన్నడ సినిమాలు చేస్తూ, బిజీ బిజీ గా ఉంది.

Rashmika-Mandanna

ఇప్పుడు తమిళం వంతు అనుకున్నదేమో, తన తొలి తమిళ సినిమాగా దళపతి విజయ్ నటించబోతున్న 63 వ చిత్రం తో తమిళంలో కూడా అడుగు పెట్టి, తన జైత్రయాత్ర కొనసాగించడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే, సర్కార్ ఘనవిజయం తరువాత విజయ్ నటిస్తున్న ఈ సినిమాని తమిళ యువదర్శకుడు అట్లీ డైరెక్ట్ చేయబోతున్నాడు. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే అట్లీ-విజయ్ లు కలిసి పోలీస్ (తమిళంలో తెరి), అదిరింది (తమిళంలో మెర్సల్) అనే రెండు బ్లాక్బస్టర్ సినిమాలు అందించగా ముచ్చటగా మూడో విజయం కోసం సిద్ధం అయ్యారు. వందకోట్ల పైచిలుకు బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తుంది. ఈ మధ్యనే పూజ కార్యక్రమం పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పట్టాలపైకి వెళ్లి, 2019 దీపావళి కానుకగా విడుదల చేయబోతున్నట్లు చిత్రం టీం ప్రకటించింది. ఈ సినిమాతో రష్మిక మందన్న తమిళ యువప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టడం ఖాయం అని కోలీవుడ్ కోడైకూస్తుంది.

Vijay Next Movie With Mersel Director Atlee