ఫ్యామిలీ స్టార్ కి రష్మిక క్యూట్ క్వశ్చన్ … పార్టీ లేదా విజయ్?

Rashmika's cute question to the family star ... Party or Vijay?
Rashmika's cute question to the family star ... Party or Vijay?

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ , సీతారామం ఫేం మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన మూవీ ‘ఫ్యామిలీ స్టార్‌’. గీతా గోవిందం పేం పరశురామ్‌ దర్శకుడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ మూవీ ఏప్రిల్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం గురువారం రోజున ట్రైలర్‌ ని విడుదల చేసింది. ఈ ట్రైలర్ను చూసిన నేషనల్ క్రష్ రష్మిక మందన్న మూవీ టీమ్‌ని మెచ్చుకుంటూ ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్ట్‌ పెట్టింది. ఈ పోస్టులో పార్టీ లేదా అంటూ విజయ్ ని అడిగింది. దీనిపై విజయ్ క్యూట్గా రిప్లై ఇచ్చాడు.

Rashmika's cute question to the family star ... Party or Vijay?
Rashmika’s cute question to the family star … Party or Vijay?

‘‘నాకెంతో ఇష్టమైన విజయ్‌ దేవరకొండ, పరశురామ్‌.. ‘ఫ్యామిలీ స్టార్‌’తో మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నా. ఏప్రిల్‌ 5వ తేదీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా. మీరు తప్పకుండా హిట్‌ కొడతారు. నాకు పార్టీ కావాలి!’’ అని అడిగింది. ఈ ట్వీట్పై విజయ్‌ దేవరకొండ స్పందిస్తూ ‘క్యూటెస్ట్’ అని రిప్లై కూడా ఇచ్చాడు. ఈ వేసవి సెలవుల్లో ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్‌ చేసే మూవీ ఇది అని విజయ్ తెలిపాడు.