కొణిదెల కుటుంబం ప్రతిష్టాత్మకం గా నిర్మిస్తున్న సైరా చిత్రం పై అంచనాలని తన సంగీతం తో మాయాజాలం చేసి మరింతగా పెంచాడు అమిత్ త్రివేది .. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ ఆర్ రహమాన్ ని పేరు ముందుగా తెర మీదకు వచ్చినా అనూహ్యం గా అవకాశం అమిత్ త్రివేది కి దక్కింది … ఈ చిత్రం తో మరో జాతీయ స్థాయి వైవిధ్యమైన సంగీత దర్శకుడు తెలుగు పరిశ్రమకి దొరికినట్లే… సైరా టిజర్ తో తన సంగీతాన్ని తెలుగు వారికి రుచి చూపించాడు … చరిత్ర మరిచిన చరితలని హృధ్యం గా వినిపించాడు … ఒళ్ళు గగుర్పొడిచే సంగీతం తో 18 వ శతాభ్ధం లో పయనించేలా చేయడం లో అమిత్ నెగ్గినట్లే..దృశ్యం మాటలాడటం ఎన్నో కబుర్లను, కథ లను చెప్పడం … వాటిని ఒడిసి పట్టుకునే కెమెరామెన్ రత్నవేలు … సైరా తో రత్నవేలు కెమెరా కన్ను ప్రేక్షకులని బ్రిటిష్ కాలానికి తనతో పాటు లాక్కేలుతుంది … నేనొక్కడినే , బ్రహ్మోత్సవం , రంగస్థలం లాంటి చిత్రాలతో తన కెమెరా పనితనం ఏంటో ఇంతకు మునుపే చూపించాడు … రత్నవేలు పనితనంతో సైరా టీజర్ ప్రేక్షకులని రెప్ప వేయకుండా చేశాడు .. అడవిదొంగ లోని చిరు ని మల్లి ఒక్కసారి గుర్తుకు తెచ్చాడు … చిరు ని మరింత అందం గా , కొత్తగా చూపించి టీజర్ లో శబాష్ అనిపించుకున్నాడు .