Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మాస్ మహారాజా రవితేజ నటించిన ‘టచ్ చేసి చూడు’ ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రంలో తనను ప్రేక్షకులు ఏ విధంగా చూడాలని కోరుకుంటున్నారో ఆ విధంగానే కనిపిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. రవితేజ సినిమాలు అంటే మాస్ మసాలా ఎలిమెంట్స్ ఉంటాయని అంతా భావిస్తారు. ఇకపై పూర్తిగా అలాగే చేస్తానని, తనను తాను కొత్తగా చూపించను అంటూ రవితేజ చెప్పుకొచ్చాడు. ఇకపై ప్రయోగాత్మక చిత్రాలను చేసేది లేదు అంటూ తేల్చి పారేశాడు. తాను గతంలో చేసిన చిత్రాల్లో కొన్ని ప్రయోగాత్మక చిత్రాలు ఉన్నాయి. అవి పెద్దగా సక్సెస్ కాలేదు. అందుకే నేను నాలాగే నటించాలని నిర్ణయించుకున్నాను అంటూ రవితేజ చెప్పుకొచ్చాడు.
‘టచ్ చేసి చూడు’ చిత్రం ప్రమోషన్లో భాగంగా మీడియాతో మాట్లాడిన రవితేజ.. ప్రయోగాత్మక చిత్రాలకు ఇకపై పూర్తిగా దూరంగా ఉంటాను అని, క్లాస్ టచ్ ఉన్న పాత్రల్లో అస్సలు నటించను అంటూ తేల్చి చెప్పాడు. ప్రేక్షకులు నన్ను నాలాగే చూడాలని కోరుకుంటున్నారు. అందుకే ఇకపై ప్రతి సినిమాలో కూడా నాలాగే నేను కనిపిస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. టచ్ చేసి చూడు చిత్రంలో రవితేజ ఫుల్ మాస్ హీరోగా కనిపించాడు. ట్రైలర్ మరియు టీజర్లో రవితేజ మార్క్ మాస్ ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. అందుకే సినిమాపై సినీ వర్గాల వారితో పాటు ప్రేక్షకుల్లో అంచనాలున్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఆ చిత్రం ఉంటుందని రవితేజ నమ్మకంగా చెబుతున్నాడు. ఇక రవితేజ త్వరలో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ‘నేలటికెట్’ అనే చిత్రంలో నటించబోతున్నాడు. ఆ సినిమాలో నివేదా థామస్ హీరోయిన్గా నటించబోతుంది. టచ్ చేసి చూడు చిత్రంలో రవితేజకు జోడీగా రాశిఖన్నా మరియు శీరత్ కపూర్లు నటించారు.