మాస్ మహారాజా రవితేజ బ్యాడ్ టైం ప్రస్తుతం పీక్స్‌లో ఉన్నట్లుగా అనిపిస్తుంది. టచ్ చేసి చూడు, నేల టికెట్ చిత్రాలు డిజాస్టర్‌లుగా నిలిచిన నేపథ్యంలో తదుపరి చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రాన్ని రవితేజ చేస్తున్న విషయం తెల్సిందే. భారీ ఎత్తున అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తుంది. తాజాగా ఈ చిత్రం మరోసారి వాయిదా పడ్డట్లుగా సమాచారం అందుతుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి కానందున విడుదల వాయిదా వేస్తున్నట్లుగా నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ ప్రకటించింది.
అక్టోబర్ 4 మొదట ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావించారు. అయితే దసరా కానుకగా విడుదల చేయాలని భావించి అక్టోబర్ 14కు విడుదల చేయాలని భావించారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం రెండు నెలల పాటు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని సమాచారం అందుతుంది. డిసెంబర్ వరకు ఈ చిత్రంను విడుదల చేసే అవకాశం లేదని సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చిత్రీకరణ అనుకున్న స్థాయిలో జరగడం లేదని, ఆ కారణంగానే సినిమాను వాయిదా వేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. అయితే సినిమా రీషూట్ కారణంగా సినిమాను వాయిదా వేసినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. రవితేజకు జోడీగా ఈ చిత్రంలో ఇలియానా నటిస్తున్న విషయం తెల్సిందే.