Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
చివరిచూపులకి తల్లితండ్రులు కూడా రాని భరత్ జీవితాన్ని చూసి ఏమి నేర్చుకోవాలి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పి తీరాల్సిందే. భరత్ మరణం గురించి రాగానే ఆయనకి మద్యం, డ్రగ్స్ అలవాటు ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఆ అలవాట్లు వల్ల ఇబ్బంది పడే వారి కుటుంబ సభ్యులు ఆయన చివరిచూపుకి కూడా రాలేదని ఎక్కువమంది వూహించుకుంటున్నారు. నిజానికి ఆ అన్నదమ్ముల్లో అందరికన్నా ముందు ఉండేవాడు భరత్. అన్న రవితేజ కన్నా ముందుగానే పెళ్లి చేసుకున్నాడు. అది కూడా ప్రేమపెళ్లి. పైగా కులాంతర వివాహం. ఈయన క్షత్రియ అయితే, ఆమె కాపు. పైగా స్థితిమంతురాలు కూడా. ఆ ఇద్దరు కలిసి అమెరికాలో హాయిగా ఉద్యోగం చేసుకునే వాళ్ళు. కుటుంబ అవసరాలకి చేదోడువాదోడుగా వుండే వాళ్ళు. ఇలా సాగుతున్న వారి జీవితంలో చిచ్చు పెట్టింది మాత్రం నటన పిచ్చి.
రవితేజ హీరో అయ్యాక కూడా భరత్ కుటుంబం హాయిగా అమెరికాలో ఉండేది. ఓ దర్శకుడు అమెరికా వెళ్ళినపుడు భరత్ ఆతిధ్యం స్వీకరించి బదులుగా ఏమీ ఇవ్వకుండా ‘ నువ్వు కూడా మీ అన్నలాగానే వున్నావు. ఇండియా వచ్చేయ్. హీరోని చేస్తా ‘ అని పొల్లుపోని డైలాగ్ ఒకటి చెప్పాడు. ఆ డైలాగ్ భరత్ జీవితానికి శాపమైంది. భరత్ లో నటించాలన్న పిచ్చి పెరిగింది. ఇంకేముంది, విమానం ఎక్కి కుటుంబంతో సహా ఇండియా వచ్చేసాడు. తీరా ఇక్కడికి వచ్చాక మాటలతో బూరెలు వండే ఆ దర్శకుడు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వలేదు. రవితేజ మాట, సొంత ప్రయత్నాలతో అడపాదడపా చిన్నాచితకా పాత్రలు వచ్చినా భరత్ ఊహించుకున్న జీవితానికి, చేస్తున్న దానికి పొంతన లేకుండా పోయింది. దీంతో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి దాన్నుంచి తప్పించుకోడానికి దురలవాట్లకి దగ్గరయ్యాడు. ఫలితం ఏమిటో చూసాం. భరత్ ని ఈ పిచ్చి నుంచి తప్పించడానికి ఆయన భార్య విశ్వప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది. దీంతో ఆమె కూడా అమెరికా వెళ్ళిపోయింది. అన్న రవితేజ, కుటుంబ సభ్యులు ఎంత చెప్పినా కూడా భరత్ తాను వున్న స్థితి నుంచి బయటికి రాలేకపోయారు. చివరకు అర్ధాంతరంగా కన్నుమూసి కన్న వాళ్ళు కూడా చివరిచూపుకి రాలేని పరిస్థితి తెచ్చిపెట్టుకున్నారు. దీనికి రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. అవేంటో చూద్దాం.
ఓ దర్శకుడు కాలక్షేపం కోసం చేసిన పిచ్చాపాటీ కామెంట్ భరత్ జీవితాన్ని సర్వనాశనం చేసింది. ఇలాంటి దర్శకులు సభ్య సమాజంలో చాలా మంది కనిపిస్తుంటారు. ఎదుటి వారి అవసరాన్ని ఆసరాగా చేసుకుని వారికి అలవికాని హామీలు ఇచ్చి, మాటలు చెప్పి ఆ తర్వాత ఏమీ తెలియనట్టు, మర్చిపోయినట్టు వ్యవహరించడం. పైగా తన మాట పట్టుకుని ఎదుటివాడు ఇబ్బందిపడుతుంటే చూసి ఆనందించే శాడిజం వీరిది. దీనివల్ల వారి మనోవికారం బయటపడడం తప్పవారికి కూడా వేరే ఒరిగేదేమీ ఉండదు. ఆ దర్శకుడు టైం పాస్ మాటల ఖరీదు ఓ జీవితం. తామేదో స్పెషల్, పక్కనోడి జీవితం లైట్ అనుకునే ఇలాంటి వాళ్ళు నిజ జీవితంలో చాలా మంది కనిపిస్తారు. వీళ్ళ దరిద్రం ఏమిటంటే తనని నమ్మినవాడిని, తన మాట గౌరవించేవాడిని అమాయకులు అనుకోవడం. గౌరవం ఇచ్చేవాడి గొప్పదనం తప్ప తీసుకునే తనది కాదని గుర్తించకపోవడం.ఇక దర్శకుడు ఏమి చెప్పినా స్వీయ విశ్లేషణ లేకుండా తనకు ఏ మాత్రం పరిచయం, అవగాహన లేని పాత్రలో రాణించాలనుకోవడం భరత్ చేసిన పెద్ద తప్పు. ఒక్క భరత్ మాత్రమే కాదు ఇప్పుడున్న సమాజంలో చాలా మంది తమకు ప్రతిభ వుందో, లేదో చూసుకోకుండా పెద్దగా శ్రమ పడకుండా పెద్దోళ్ళు అయిపోయిన వారిలా బతకాలి అనుకోవడం భరత్ చేసిన ఇంకో తప్పు. ఇలా జీవితాన్ని ఫెయిల్యూర్ దిశగా తీసుకెళ్తున్న భరత్ లు ఎందరో. వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన జీవిత సత్యం ఒకటుంది. ” జీవితమనేది అతి కష్టమైన, క్లిష్టమైన పరీక్ష. ఈ పరీక్షలో చాలా మంది ఫెయిల్ అవుతున్నారు . దీనికి కారణం వాళ్ళు పక్కనోళ్ళని చూసి కాపీ కొట్టడానికి ప్రయత్నించడమే. వాళ్లకి అర్ధం కాని విషయం ఏమిటంటే… ప్రతి ఒక్కరికి ఒక్కో రకమైన ప్రశ్నపత్రం ఉంటుంది. దీన్ని గుర్తుంచుకుని ముందుకు వెళితే భరత్ లాగా జీవితానికి విషాద ముగింపులు వుండవు.
మరిన్నివార్తలు
ఎన్టీఆర్ బెడ్ రూమ్ లో కెమెరాలు.