రవితేజ ప్రస్తుతం శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. రవితేజ గత చిత్రాలు టచ్ చేసి చూడు మరియు నేల టికెట్ చిత్రాలు ఫ్లాప్ అవ్వడంతో రవితేజకు ఈ చిత్రం సక్సెస్ చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. అందుకే అమర్ అక్బర్ ఆంటోనీ విషయంలో రవితేజ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ చిత్రం తర్వాత రవితేజ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తమిళ సూపర్ హిట్ మూవీ ‘తేరీ’ రీమేక్ అవ్వాల్సి ఉంది. కాని ‘తేరీ’ సినిమా రీమేక్ చేయాలంటే రవితేజ భయపడుతున్నట్లుగా సమాచారం అందుతుంది. ఇప్పటికే వరుస ఫ్లాప్‌లతో ఉన్న తాను ఇలాంటి సమయంలో రీమేక్‌తో ప్రయోగాన్ని చేయడం పెద్ద సాహసం అవుతుందని, అందుకే తేరీ రీమేక్‌ను వదిలేసినట్లుగా తెలుస్తోంది.
‘తేరీ’ రీమేక్ స్థానంలో సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక ఫ్రెష్ స్టోరీతో సినిమాను చేసేందుకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. దసరా సందర్బంగా సినిమా ప్రారంభోత్సవం చేయాలని కూడా రవితేజ భావిస్తున్నాడట. అమర్ అక్బర్ ఆంటోనీ చిత్రం తర్వాత పూర్తి స్థాయి మాస్ మసాలా చిత్రంగా రవితేజ మూవీ తెరకెక్కబోతుంది. సంతోష్ శ్రీనివాస్ ‘కందిరీగ’ వంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రంగా స్క్రిప్ట్‌ను సిద్దం చేస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ లేదా దసరాకు చిత్రాన్ని విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. రవితేజ ‘తేరీ’ వద్దనుకుని చేయబోతున్న సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందా అనేది చూడాలి.