Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మాస్ మహారాజా రవితేజ హీరోగా టర్న్ అయినప్పటి నుండి నేడు విడుదలైన ‘టచ్ చేసి చూడు’ చిత్రం వరకు దాదాపు అన్ని చిత్రాల్లో కూడా ఒకే తరహా పాత్రలో నటించాడు. ఒకటి రెండు చిత్రాు మినహా అన్ని చిత్రాల్లో కూడా మాస్ హీరోగానే రవితేజ కనిపించాడు. అందులో కొన్ని సినిమాలు అదృష్టం బాగుండి సక్సెస్ అవ్వగా కొన్ని మాత్రం ఫ్లాప్ అయ్యాయి. రవితేజ తన ప్రతి సినిమాలో కూడా ఒక తరహా పాత్రను చేయడం వల్ల ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతున్నారు. ఇటీవల విడుదలైన ‘రాజా ది గ్రేట్’ చిత్రంలో కూడా రవితేజ మూస పాత్రలోనే నటించాడు. అయితే ఆ సినిమాలో కాస్త కంటెంట్ ఉన్న కారణంగా సినిమా సక్సెస్ అయ్యింది. తాజాగా టచ్ చేసి చూడు చిత్రంలో రవితేజ పాత్ర పరమ రొటీన్‌గా ఉందనే విమర్శలు వస్తున్నాయి.
రవితేజ పూర్తి ప్రయోగాత్మకంగా కాకున్నా కనీసం కొత్తగా కనిపించేందుకు ప్రయత్నించాలని, లేదంటే త్వరలోనే రవితేజ హీరోగా కెరీర్‌కు ఫుల్స్టాప్ పెట్టే సమయం వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చేస్తున్న ‘నేలటికెట్’ చిత్రంలో కూడా రవితేజ మూస పద్దతిలో మాస్ పాత్రను చేస్తూ ఉంటాడని, కాస్త ఆలోచించి ఇకపై అయినా నిర్ణయం తీసుకోవాలని ఆయనకు సినీ వర్గాల నుండి సలహా వినిపిస్తుంది. మరి రవితేజ ఇప్పటికైనా పాత్రల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాడా లేదా అనేది చూడాలి. ‘నేలటికెట్’తో పాటు శ్రీనువైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రంలో రవితేజ నటిస్తున్నాడు. ఆ రెండు చిత్రాలు కూడా మూస కొట్టుడుతోనే ఉంటే రవితేజ కెరీర్ ప్రమాదంలో పడ్డట్లే.