రవితేజ సంచలన నిర్ణయం.. మంచిదేనా?

ravi-teja-sensational-decision-on-movies

 Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
చిన్న హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా కష్టపడి మెల్లగా స్టార్‌ హీరో అయిన రవితేజ గత రెండు సంవత్సరాలుగా సినిమా ఏది విడుదల చేయలేదు. ఏవో కారణాల వల్ల సినిమాలకు కాస్త బ్రేక్‌ వేశాడు. తాజాగా ‘రాజా ది గ్రేట్‌’ అంటూ రవితేజ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. రెండు సంవత్సరాల గ్యాప్‌ను ఈ చిత్రంతో ఫిల్‌ చేస్తాను అంటూ రవితేజ చెప్పుకొస్తున్నాడు. అనీల్‌రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను దీపావళి కానుకగా విడుదల చేయబోతున్నారు. దిల్‌రాజు నిర్మించిన ఈ సినిమా ప్రమోషన్‌లో ప్రస్తుతం రవితేజ పాల్గొంటున్నాడు.

ప్రమోషన్‌లో భాగంగా తన భవిష్యత్తు ప్రణాళికలను మీడియా ముందు ఉంచాడు. దాదాపు మూడు నాలుగు సంవత్సరాల పాటు చాలా రొటీన్‌ సినిమాల్లో నటించాను అని, ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయాలనే ఉద్దేశ్యంతో కొత్తదనంతో కూడిన కథలు ఎంచుకోకుండా రోటీన్‌ సినిమాలు చేశాను అంటూ చెప్పుకొచ్చాడు. అందులో కొన్ని సక్సెస్‌ అయినా కూడా తృప్తిని ఇవ్వలేదని పేర్కొన్నాడు. ఇకపై రొటీన్‌ సినిమాలను అస్సలు చేయను అని, తాను చేయబోతున్న ప్రతి సినిమా విభిన్నంగా ఉంటుందని, ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా వైవిధ్యభరితంగా ఉండేలా ప్లాన్‌ చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు.

రవితేజ తీసుకున్న నిర్ణయం మంచిదే అని, ఊరికే రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలు చేయడం కంటే ఇలా విభిన్న కథా చిత్రాలు చేయడం వల్ల మంచి పేరు కూడా వస్తుందని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. ‘రాజా ది గ్రేట్‌’ చిత్రం తర్వాత ‘టచ్‌ చేసి చూడు’ చిత్రాన్ని రవితేజ విడుదల చేయనున్నాడు. ఇంకా పలు చిత్రాలను రవితేజ లైన్‌లోకి తీసుకు వస్తున్నాడు. వచ్చే సంవత్సరంలో రెండు లేదా మూడు సినిమాలను రవితేజ విడుదల చేసే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు