Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఏటీఎంలు ఇక ముగిసిన చరిత్రేనని ఆర్బీఐ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఏటీఎంలు ఇక తగ్గిస్తారన్న పుకారుకు అనుగుణంగానే ఏటా రెండు వేల ఏటీఎంలు తగ్గించేయాలని ఆర్బీఐ భావిస్తోందట. పరిస్థితి చూస్తుంటే.. జనం మళ్లీ పాతరోజుల్లోలాగా డబ్బుల కోసం బ్యాంకుకు వెళ్లక తప్పేలా కనిపించడం లేదు. జనం డబ్బు జనం దగ్గర లేకుండా చేయడానికి కేంద్రం ఎన్ని ప్రయత్నాలు చేయాలో.. అన్నీ చేస్తోంది.
ఇప్పటికే నోట్లరద్దు ఇబ్బందులు ఇంకా తీరలేదు. బ్యాంకుల్లో క్యాష్ లేదు. ఏటీఎంల్లో కూడా అరకొరగానే ఉంది. కొన్ని బ్యాంకులైతే రెండు రోజుల ముందు ఆర్డర్ ఇస్తే.. మూడోరోజు క్యాష్ డెలివరీ చేస్తున్నాయి. పరిస్థితి ఇలా ఉంటే.. ఆర్బీఐ మరోవైపు సైలంట్ గా ఏటీఎంలు తగ్గించేస్తోంది. చాప కింద నీరులా ప్రణాళికలు అమలు చేస్తున్న మోడీ ప్రభుత్వం.. ఏటీఎంల విషయంలోనూ అలాగే ఆలోచిస్తోంది.
నిజానికి యూపీఏ హయాంలో ఏటీఎంలు విస్తృతంగా వాడుకలోకి వచ్చాయి. ఎక్కడ చూసినా ఏటీఎంలే కనిపించేవి. దీంతో జనం కూడా వాటిలోనే డబ్బులు తీసుకోవడానికి అలవాటుపడ్డారు. తద్వారా బ్యాంకులపై కూడా భారం తగ్గింది. కానీ మోడీ రివర్సులో ఆలోచిస్తున్నారు. ఏటీఎంల వల్లే బ్లాక్ మనీ వస్తోందని, బ్యాంకుల నుంచైతే జనం అంత దైర్యంగా పెద్ద అమౌంట్లు తీసుకోరని భావిస్తున్నారు.
మరిన్ని వార్తలు: