Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
నకిలీ కరెన్సీ నోట్ల చలామణికి అడ్డుకట్ట వేసేందుకు రిజర్వు బ్యాంకు కొత్త వ్యూహంతో ముందుకొస్తోంది. భారీ ఎత్తున రూ. 200 నోట్లను ముద్రిస్తున్న రిజర్వ్ బ్యాంక్ వీలయినంత తొందరగా… వాటిని చలామణిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నెల చివరి వారంలో కానీ, సెప్టెంబరు మొదటి వారంలోకాని. రూ.200 నోట్లు చలామణిలోకి వస్తాయని రిజర్వ్ బ్యాంకు వర్గాలు వెల్లడించాయి. నోట్ల రద్దు తర్వాత కొత్త నోట్ల కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించిన రిజర్వుబ్యాంక్ రూ.200 నోట్లను రూ. 50 కోట్ల మేర ముద్రించినట్టు సమాచారం. ఇవన్నీ ఒకేసారి చలామణిలోకి తేవాలని రిజర్వ్ బ్యాంక్ యోచిస్తోంది.
డీమానిటైజేషన్ తర్వాత రూ. 2, 000 నోట్లను బ్లాక్ మార్కెట్ దళారులు గుప్పిటపట్టి మార్కెట్ లోకి వచ్చిన నోట్లను వచ్చినట్టు మాయం చేశారు. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఈ సారి అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీ మొత్తంలో నోట్లు ముద్రించి చలామణిలోకి తెస్తున్నారు. దీనివల్ల సామాన్య ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా…చెల్లింపులు చేసుకునేందుకు వీలుంటుందని భావిస్తున్నారు. రూ. 100, రూ. 500 మధ్య మరో కరెన్సీ నోటు లేకపోవటంతో రూ. 200 నోటుకి మంచి ఆదరణ లభిస్తుందని ఆర్ బీఐ అంచనా వేస్తోంది.
మరిన్ని వార్తలు: