వడ్డీ రేట్లపై RBI కీలక నిర్ణయం.

RBI's key decision on interest rates.
RBI's key decision on interest rates.

అనుకున్నట్టే జరిగింది. ఈసారి కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచేసింది. వరుసగా మూడోసారి కీలక వడ్డీరేట్లలో ఆర్‌బీఐ ఎలాంటి మార్పులు చేయలేదు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రెపోరేటును 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వెల్లడించారు. మంగళవారం ప్రారంభమైన పరపతి విధాన కమిటీ సమావేశ నిర్ణయాలను ప్రకటించారు.

రెపో రేటును 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు గవర్నర్‌ శక్తి కాంత దాస్‌ వెల్లడించారు. ఎంఎస్‌ఎఫ్‌, బ్యాంక్‌ రేట్‌ సైతం 6.75 శాతం వద్ద స్థిరంగా ఉన్నాయి. గత జూన్‌ సమావేశంలోనూ రెపో రేటు 6.5 శాతంగా కొనసాగించాలని ,ఎలాంటి మార్పు చేయకుండా విషయం తెలిసిందే. వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడం వరుసగా ఇది మూడోసారి. అంతకు ముందు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు 2022 మే నుంచి వరుసగా ఆరు దఫాల్లో రెపో రేటును 250 బేసిస్‌ పాయింట్ల మేర రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచింది.