Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
ఎప్పుడెప్పుడా అని ప్రజలంతా ఆతృతగా ఎదురుచూస్తున్న . 200 నోటు రేపు మార్కెట్ లోకి వచ్చేస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. గత ఏడాది నవంబరు 8న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తరువాత రిజర్వ్ బ్యాంక్ విడుదల చేస్తున్న మూడో నోటు ఇది. పెద్ద నోట్ల అక్రమ నిల్వలు, నకిలీ కరెన్సీ నోట్లకు అడ్డుకట్ట వేయటమే లక్ష్యంగా రూ. 200 నోటును చలామణిలోకి తెస్తున్నారు. రూ. 100, రూ.500 మధ్య మరో కరెన్సీ లోటు ఇప్పటిదాకా లేకపోవటంతో రూ. 200 నోటుకు మంచి ఆదరణ లభిస్తుందని ఆర్బీఐ అంచనా వేస్తోంది.
పెద్ద నోట్ల రద్దు తర్వాత చిన్న నోట్ల కోసం ఎదురవుతున్న సమస్యలు కూడా రూ. 200 నోటుతో తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. అటు ఈ నోటును భారత సంప్రదాయ వారసత్వం ప్రతిబింబించే దిశగా ఆర్బీఐ తయారుచేసింది. పసుపు రంగులో ఉన్న రూ.200నోటు వెనుక భాగాన సాంచీ స్తూపం బొమ్మను ముద్రించారు. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంతకం నోటుపై ఉంది. ఎంపిక చేసిన కొన్ని బ్యాంకులు, ఆర్బీఐ కార్యాలయాల్లో రేపటి నుంచి రూ.200 నోటు అందుబాటులోకి రానుంది.
మరిన్ని వార్తలు: