లోకేష్ సైలెన్స్ వెనుక ఏముంది ?

reason-behind-lokesh-silence-is-the-ycp

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2019 ఎన్నిక చాలా కీలకం. ఈ ఎన్నికల్లో ఓడిపోతే వైసీపీ అస్తిత్వమే ప్రమాదంలో పడుతుంది. ఇక టీడీపీ కి కూడా ఈ ఎన్నికల్లో గెలిస్తేనే కొత్త రాష్ట్రం విషయంలో కొన్ని అయినా చెప్పుకోదగ్గ పనులు పూర్తి చేయగలుగుతుంది. ఈ పరిస్థితుల్లో క్యాబినెట్ లో చేరిన లోకేష్ మంత్రి పదవితో పాటు చంద్రబాబు తనయుడిగా మొత్తం చక్రం తిప్పెయ్యొచ్చు. ఆయనే కేంద్రంగా రాజకీయ వ్యవహారాలూ నడపొచ్చు. మనం చెప్పుకున్న ఈ రెండు పనులు లోకేష్ చేయడం లేదు అనలేము గానీ వాటిని జనం గుర్తించాలని, మీడియాలో రావాలని తాపత్రయ పడడం లేదు. ఈ విషయంలో లోకేష్ కాస్త సైలెంట్ గానే వ్యవహరిస్తున్నారు అనుకోవాలి. కానీ ఎందుకు ? ఈ విషయంలో ఆరా తీసినప్పుడు ఓ ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది.

లోకేష్ సైలెన్స్ వెనుక కారణం వైసీపీ. లోకేష్ సైలెంట్ గా వ్యవహారాలు నడపడం చూసి ఎక్కువగా హర్ట్ అయ్యింది జగన్. నిజం. వైసీపీ వ్యూహకర్తలు నిజంగానే ఓ అద్భుతమైన ప్లాన్ వేశారు. చంద్రబాబు సామర్ధ్యం, నాయకత్వ లక్షణాలతో పోల్చుకున్నప్పుడు జగన్ తక్కువగా కనిపిస్తున్నాడన్న విషయం వారికి అర్ధం అయ్యింది. అందుకే వచ్చే ఎన్నికల నాటికి ఈ పోటీ జగన్ , లోకేష్ మధ్య అని ఫోకస్ చేయడానికి ప్రయత్నించారు. అందుకే సోషల్ మీడియాలో లోకేష్ ని తక్కువ చేసి చేసి చూపి అతన్ని రెచ్చగొట్టి బయటికి వచ్చేలా చేస్తే తాము అనుకున్న ప్లాన్ సక్సెస్ అవుతుందని భావించారు. కాస్త ఆలస్యంగా అయినా ఈ విషయం లోకేష్ అండ్ కో కి అర్ధం అయ్యింది. ఫలితమే లోకేష్ సైలెన్స్.