Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆయన 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. చాలా వెయిటింగ్ తర్వాత చిరంజీవి ఈ చిత్రాన్ని మొదలు పెట్టాడు. ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తి అయ్యింది. మొదటి షెడ్యూల్ కోసం చిరంజీవి గడ్డంను పెంచాడు. మొదటి షెడ్యూలు ఎప్పుడైతే పూర్తి అయ్యిందో వెంటనే నీట్ షేవ్‌తో కనిపించాడు. దాంతో అంతా కూడా పలు రకాలుగా ఊహించుకున్నారు. సినిమా క్యాన్సిల్ అయ్యిందని కొందరు, మరి కొందరు గడ్డం లేకుండా రెండవ షెడ్యూల్ సీన్స్ ఉంటాయని అంచనా వేశారు. అసలు విషయం ఏంటీ అంటే చిరంజీవి గడ్డం తీయడం వెనుక పెద్ద కారణం ఏమీ లేదని, షూటింగ్‌కు కాస్త ఎక్కువ సమయం ఉన్నందునే గడ్డం తీసేశారు అంటూ మెగా ఫ్యామిలీ సన్నిహితుల నుండి క్లారిటీ వచ్చింది.
ఇటీవలే ‘సైరా’ మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేశారు. రెండవ షెడ్యూల్‌ను కేరళలో చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. వచ్చే నెల చివర్లో రెండవ షెడ్యూల్ ఉండబోతుంది. అంటే రెండవ షెడ్యూల్‌కు దాదాపు రెండు నెలలు గ్యాప్ ఉన్న కారణంగా గడ్డం తీసేసినట్లుగా తెలుస్తోంది. షూటింగ్‌కు నెల ఉండగా మళ్లీ గడ్డంను చిరంజీవి పెంచుతాడు అంటూ వారు చెబుతున్నారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం రెండవ షెడ్యూల్ కోసం కేరళలో రెండు భారీ సెట్టింగ్‌లను ప్రస్తుతం యూనిట్ సభ్యులు నిర్మిస్తున్నారు. వచ్చే నెలలో సెట్స్ నిర్మాణం పూర్తి అవ్వనుందట. నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబచ్చన్, జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతిలు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. వచ్చే సంక్రాంతికి సినిమాను విడుదల చేసేలా నిర్మాత రామ్ చరణ్ ప్లాన్ చేస్తున్నాడు.