Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
శ్రీరెడ్డి చేస్తున్న పోరాటంకు రామ్ గోపాల్ వర్మ కాస్త ఎక్కువ శ్రద్ద పెట్టి మద్దతు తెలుపుతున్న విషయం తెల్సిందే. వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎందుకు ఇంతగా శ్రీరెడ్డికి మద్దతు పలుకుతున్నాడు అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రశ్నకు స్వయంగా రామ్ గోపాల్ వర్మ సమాధానం చెప్పాడు. శ్రీరెడ్డి చేస్తున్న ఉద్యమం గురించి మొదట్లో తెలుసుకుని అభినందించాను. ఆమె పలువురు పెద్ద వారి పేర్లు చెబుతున్నప్పుడు ఆమె ధైర్యం నచ్చింది. అయితే శ్రీరెడ్డి అభిరామ్ చేసిన వ్యాఖ్యలపై తాను మద్యవర్తిత్వం చేసి, ఆమెకు అయిదు కోట్లు ఇప్పిస్తాను అంటూ చెప్పాను. కాని ఆమె మాత్రం ఆ డబ్బు తనకు అక్కర్లేదని, ఒక వేళ ఆ డబ్బును కనుక తీసుకుంటనే నా మొహంను నేను అద్దంలో చూసుకోలేను అంటూ చెప్పుకొచ్చింది. అందుకే శ్రీరెడ్డి అంటే తనకు మరింత అభిమానం పెరిగిందని వర్మ చెప్పుకొచ్చాడు.
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సలహా మేరకు శ్రీరెడ్డి పవన్‌పై తీవ్ర స్థాయిలో, అభ్యంతరకర పదజాలంతో విమర్శలు చేసిన విషయం తెల్సిందే. ఆ వ్యాఖ్యల వెనుక తాను ఉన్నాను అంటూ స్వయంగా రామ్ గోపాల్ వర్మ ప్రకటించడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది. శ్రీరెడ్డి చేస్తున్న ఉద్యమంకు అర్థం ఉందని, అందుకే ఆమెకు తాను మద్దతు పలికేందుకు ముందుకు వచ్చాను అని, ఆమె ఎక్కువ మంది దృష్టిని ఆకర్షించేందుకు పవన్‌పై విమర్శలు చేయాల్సిందిగా సూచించాను అంటూ వర్మ చెప్పాడు. శ్రీరెడ్డిలాంటి అమ్మాయికి మహిళ సంఘం నాయకులు మరియు సినీ వర్గాల వారు మద్దతుగా నిలవాలని, ఆమె కోట్లను కూడా కాదని తన ఉద్యమంను ముందుకు తీసుకు వెళ్తుందని, ఆమె చాలా అభినందనీయురాలు అంటూ వర్మ ప్రశంసల వర్షం కురిపించాడు.