Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కిన ‘టచ్ చేసి చూడు’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. రొటీన్ కథ, కథనంతో ఏమాత్రం ఆకట్టుకోలేక మొదటి రోజే ఫ్లాప్ అని తేలిపోయింది. రవితేజ కెరీర్‌లో మరో చెత్త సినిమాగా ‘టచ్ చేసి చూడు’ నిలిచింది. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. విక్రమ్ తాను అనుకున్నట్లుగా సినిమాను తెరకెక్కిస్తూ వెళ్తున్న సమయంలో రవితేజతో గొడవలు వచ్చి కొన్నాళ్ల పాటు సినిమా ఆగిపోయిన విషయం తెల్సిందే. ఆ తర్వాత నిర్మాతలు దర్శకుడు విక్రమ్ సిరికొండతో మాట్లాడి రవితేజకకు ఇష్టం వచ్చినట్లుగా స్క్రిప్ట్ మార్పులు చేయించి, ప్రతి సీన్‌ను కూడా రవితేజ నిర్ణయం ఆధారంగా తీయాలని సూచించారు.
రవితేజ పూర్తిగా ‘టచ్ చేసి చూడు’ చిత్రం దర్శకత్వంలో వేలు పెట్టడం వల్ల ఫలితం తారు మారు అయ్యింది అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సన్నిహితుల వద్ద దర్శకుడు విక్రమ్ సిరికొండ మాట్లాడుతూ తాను అనుకున్న సినిమాను తీయనివ్వకుండా, తాను అనుకున్నట్లుగా రవితేజ పూర్తి చేశాడని, ఫైనల్ అవుట్ పుట్‌కు, తాను మొదట అనుకున్న సినిమాకు పూర్తి విరుదంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. మొత్తానికి రవితేజ చేసిన పని వల్ల ఇప్పుడు సినిమా ఫలితం తారు మారు అయ్యింది. ‘రాజా ది గ్రేట్’తో సక్సెస్ ట్రాక్ ఎక్కిన రవితేజ ఆ వెంటనే ఈ చిత్రంతో ఫ్లాప్ అవ్వడంతో అభిమానులు తీవ్ర నిరుత్సాహంను వ్యక్తం చేస్తున్నారు.