Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
విభిన్న చిత్రాలతో తెలుగులో విశేష అభిమానులను సొంతం చేసుకున్న దర్శకుడు సుకుమార్ తాజాగా ‘రంగస్థలం’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. రికార్డు స్థాయిలో వసూళ్లు సాధిస్తున్న ‘రంగస్థలం’ చిత్రం సక్సెస్‌ను పురష్కరించుకుని దర్శకుడు సుకుమార్ మీడియాతో మాట్లాడాడు. ఆ సందర్బంగా తనకు దిల్‌రాజుకు చాలా కాలం క్రితం జరిగిన ఒక చిన్న సంఘటనను చెప్పుకొచ్చాడు. దిల్‌రాజుపై కోపంతో తాను జగడం చిత్రాన్ని చేశాను అంటూ చెప్పుకొచ్చాడు.
సుకుమార్ మాట్లాడుతూ.. ‘ఆర్య’ చిత్రం సక్సెస్ తర్వాత ‘జగడం’ చిత్రాన్ని అల్లు అర్జున్ లేదా మహేష్‌బాబుతో చేయాలని భావించాను. అయితే కొన్ని కారణాల వల్ల దిల్‌రాజుపై కోపంతో రాత్రికి రాత్రి ఆ చిత్రాన్ని రామ్‌తో ప్లాన్ చేయడం జరిగింది. మొదట రామ్ తమ్ముడు పాత్రలో అనుకున్నాను. కాని దిల్‌రాజు గారి మాటలు నాకు కోపం తెప్పించాయి, దాంతో రామ్‌ను లీడ్ రోల్లో పెట్టి చిత్రాన్ని చేయడం జరిగింది. జగడం చిత్ర ప్రారంభోత్సవంకు దిల్‌రాజు రావడం, ఆయన నీకేమైన బుద్ది ఉందా, ఇంత మంచి స్క్రిప్ట్‌తో ఇంత హడావుడిగా సినిమాను మొదలు పెట్టడం ఏంటని ప్రశ్నించాడు. దాంతో కోపం వచ్చి ఇలా చేశాను అంటూ చెప్పేశాను. ఆ తర్వాత సినిమా విడుదల అవ్వడం, విడుదలైన సినిమా ఫ్లాప్ అవ్వడంతో తాను చేసిన తప్పు తెలిసి వచ్చిందని సుకుమార్ పేర్కొన్నాడు.